Begin typing your search above and press return to search.
విలీనాన్ని బాయ్ కాట్ తో డ్యామేజ్ చేస్తారట!
By: Tupaki Desk | 7 Jun 2019 7:27 AM GMTఎంత తెలిసిన విషయమే అయినా.. తీరా ఆ సమయానికి ఆవేశం.. ఆగ్రహం మామూలే. తాజాగా టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ శాసనసభాపక్ష విలీనం విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీరు ఇదే తీరులో ఉంది. విలీనం రేపో.. మాపో అన్న విషయం కాంగ్రెస్ నేతలకు తెలిసినా.. తాజాగా వెలువడిన ఫలితాల నేపథ్యంలో కాస్త ఆగుతారన్న భావన కలిగినా.. అలాంటిదేమీ లేదన్న విషయాన్ని తన చేతలతో తేల్చి చెప్పారు కేసీఆర్.
పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. నిరసన బాట పట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేల్ని.. టీఆర్ ఎస్ లో విలీనాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది.
తాజాగా జరిగే అసెంబ్లీ సమావేశాల్ని బాయ్ కాట్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. శాసనసభాపక్షాన్ని విలీనం చేసేందుకు సాహసించిన కేసీఆర్ తీరును తూర్పార పట్టటంతో పాటు.. చేతిలో ఉన్న అధికారాన్ని ఏ రీతిలో దుర్వినియోగం చేస్తున్నారన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలుగా ఆందోళన బాట పట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
పీసీసీ అనుమతి లేకుండా ఏ రీతిలో పార్టీ శాసన సభాపక్షాన్ని విలీనాన్ని నిర్వహిస్తారని ఉత్తమ్ లాంటి సీనియర్లు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విలీనం చెల్లదని.. దీనిపై కోర్టులో సవాలు చేస్తామని మరో ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. టీఆర్ఎస్ చేసిన విలీనానికి ఖరీదైన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడుతుననారు. ఎమ్మెల్యేల్ని ఇంత దారుణంగా కొనుగోలు చేస్తారా? సంతలో పశువుల మాదిరి కొనేయటం ఏమిటి? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ తీరును ఎండగట్టటంలో భాగంగా త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్ని కాంగ్రెస్ బాయ్ కాట్ చేస్తుందని.. జిల్లాల్లో నిరసనలు నిర్వహిస్తామని ఉత్తమ్ అండ్ కో చెబుతోంది. చూస్తుంటే.. విలీనంతో టీఆర్ఎస్ కు వచ్చిన ప్లస్ ను తప్పనిసరిగా మైనస్ చేయాలన్నదే తమ ఉద్దేశంగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.