Begin typing your search above and press return to search.

మా త‌ప్పు మేమే స‌రిదిద్దుతాం.. అనే సిద్ధాంతంలో కాంగ్రెస్‌?

By:  Tupaki Desk   |   17 Aug 2021 11:30 AM GMT
మా త‌ప్పు మేమే స‌రిదిద్దుతాం.. అనే సిద్ధాంతంలో కాంగ్రెస్‌?
X
ఏపీ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? ఇప్ప‌టికైతే.. ఎలానూ పార్టీ పుంజుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. మ‌రి ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతుందా? లేక వ్యూహాత్మ‌కంగా ఏదైనా అడుగుల దిశ‌గా పార్టీ ప‌య‌ని స్తుందా? అంటే.. వ్యూహాత్మ‌కంగా నే పార్టీ నేత‌లు పావులు క‌దుపుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేంటంటే.. ప్ర‌స్తుతం ఏపీ ప‌రిస్థితి.. దారుణంగా ఉన్న నేప‌థ్యంలో మా త‌ప్పును మేమే స‌రిదిద్దుతాం.. అనే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అవ‌లంభిస్తోంద‌ని ఆ దిశ‌గా పార్టీ నేత‌లు.. దృష్టి పెట్టార‌ని అంటున్నారు. ఇదే వ్యూహం క‌నుక వ‌ర్క‌వుట్ అయితే.. కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితి ఉంటుంద‌ని అంటున్నారు.

విష‌యంలోకి వెళ్తే.. ఏపీ ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న‌తో.. అనేక స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. తెలంగాణ ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఏపీకి ఆర్థిక లోటు.. తీవ్ర‌స్థాయిలో ఇబ్బందిక‌రంగా మారింది. అదేస‌మ‌యంలో ఏపీ ప్ర‌జ‌లు విభ‌జ న‌కు ఒప్పుకోలేదు. అయిన‌ప్ప‌ట‌కీ.. కాంగ్రెస్ నేత‌లు.. ప‌ట్టుబ‌ట్టి.. రాష్ట్ర‌ విభ‌జ‌న చేయించారు. దీంతో ఏపీలో ప్ర‌జ‌లు.. కాంగ్రెస్‌ను దూరం పెట్టారు. క‌నీసం ఒక్క‌టంటే ఒక్క చోట కూడా పార్టీ 2014, 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోలేక పోయింది. ఇక‌, ఈ పార్టీ ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఏపీ పాల‌న విష‌యానికి వ‌స్తే.. రాష్ట్ విబ‌జ‌న క‌ష్టాల్లో ఉన్న ఏపీని చంద్ర‌బాబు అయితే.. గ‌ట్టెక్కిస్తార‌ని అంద‌రూ భావించారు.

ఈ క్ర‌మంలోనే 2014లో ప్ర‌జ‌లు టీడీపీని గెలిపించారు. అయితే.. కొంత‌వ‌ర‌కు బాగానే న‌డిచినా.. ఆర్థిక లోటు మ‌రింత పెరిగిపోయింది. అదేస‌మ‌యంలో విభ‌జ‌న హామీల‌ను నెగ్గించుకోవ‌డంలోను, ముఖ్యంగా ప్ర‌త్యేక హోదాను రాబ‌ట్టుకునే విష‌యంలోనూ.. చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యారు. దీనికితోడు అవినీతి పెరిగిపోయింద‌నే వాద‌న కూడా ప్ర‌బ‌లంగా తెర‌మీదికి వ‌చ్చింది. ఇదేస‌మ‌యంలో.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఒక్క ఛాన్స్ ఇవ్వ‌మ‌న్న సెంటిమెంటుతో ప్ర‌జ‌లు ఆయ‌న వైపు మొగ్గు చూపారు. దీంతో 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది.

ఈ క్ర‌మంలో రెండున్న‌రేళ్లు గ‌డిచిన వైసీపీ స‌ర్కారు.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ఫ‌లాలు అందిస్తున్నా.. అభివృ ద్ధి విష‌యంలో మాత్రం ఒకింత వెనుక‌బ‌డింది. అంతేకాదు.. అప్పులు కూడా ఏటికేడు పెరిగిపోయాయి. ప్ర‌స్తుతం అప్పులు కూడా పుట్ట‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో ప్ర‌జ‌లు ఇప్పుడు ఏపీని ఎలా అభివృద్ధి చేసేవారు ఎవ‌రా? అనే విష‌యంలో చ‌ర్చిస్తున్న మాట వాస్త‌వం. ఈ క్ర‌మంలో ఈ గ్యాప్‌ను అందిపుచ్చు కునేందుకు కాంగ్రెస్ నేత‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌నే వాద‌న తెర‌మీదికి వ‌స్తోంది.


అంటే.. ఏపీ విభ‌జ‌న కార‌ణంగానే ఇప్పుడు ఇన్ని స‌మ‌స్య‌లు వ‌చ్చినందున‌.. ఆ త‌ప్పును తామే చేసినందున‌.. ఇప్పుడు ఆ త‌ప్పును తామే స్వ‌యంగా స‌రిదిద్దాల‌నే వ్యూహంతో.. కాంగ్రెస్ నేతలు ఉన్నార‌ని.. ఇదే విష‌యాన్ని.. వారు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి .. ఇది ఏమేర‌కు కాంగ్రెస్‌కు ప్ల‌స్ అవుతుందో చూడాలి.