Begin typing your search above and press return to search.
ఇవాంక రాక.. రాజకీయాల్లో కాక పుట్టిస్తుందా?
By: Tupaki Desk | 28 Nov 2017 7:44 AM GMTజీఈఎస్ (ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు)ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసింది. బ్రాండ్ హైదరాబాద్ ప్రచారానికి దీనిని వేదికగా భావిస్తోంది. ప్రభుత్వం ఈ సదస్సు కోసం తలమునకలై ఉన్న సమయంలో విపక్ష కాంగ్రెస్ ఊహించని ప్రశ్న సంధించింది. నేరుగా ముఖ్యమంత్రినే టార్గెట్ చేసి సంధించిన ఈ ప్రశ్నకు కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారోనని రాజకీయవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పరిస్థితులనైనా తన మాటలతో అనుకూలంగా మార్చుకోగలరు. అపర చాణక్యుడిగా, మాటలతో మంత్ర ముగ్ధుల్ని చేస్తారని ఆయనకు పేరుంది. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించాలన్నా, పాలనకు సంబంధించిన విశేషాలను వెల్లడించాలన్నా కేసీఆర్ తర్వాతే ఎవరైనా! అయితే ఆయనను ఇరుకున పెట్టే ప్రశ్న ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి వెలువడింది. ప్రస్తుతం జీఈఎస్ కోసం నగరానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం ఎందుకు కల్పించలేదని అడిగితే ఏమని సమాధానం చెబుతారని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ప్రశ్నించారు.
మహిళా సంక్షేమం గురించి గొప్పగా చెప్పే కెసిఆర్ మంత్రివర్గంలో వారికి స్థానం కల్పించలేదని శారద విమర్శించారు. టీఆర్ ఎస్ మహిళా ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో నోరు మెదపక పోవడాన్ని ఆమె తప్పుబట్టారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే లోక్ సభలో బిల్లు ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. లోక్ సభలో బిల్లు పాసైన తర్వాత రాజ్యసభలో తమ పార్టీకి బలం ఉన్నందున తప్పని సరిగా మద్ధతునిస్తుందని చెప్పారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే విధంగా తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని ఆమె తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం హైదరాబాద్ కు వస్తున్నందున గతంలోనే అపాయింట్‌మెంట్ కోరామని.. ఇంత వరకు ఆయన స్పందించలేదని శారద చెప్పారు. అమెరికా అధ్యక్షుడి కూతురు అయితేనే అపాయింట్ మెంట్ ఇస్తారా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని శారద ఆరోపించారు. అందరూ ఇవాంక, కెసిఆర్ తనయ కవిత కాలేరు కదా అని శారద అన్నారు. ఏది ఏమైనా శారద అడిగిన ప్రశ్నకు కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.