Begin typing your search above and press return to search.

రేవంత్ హీరోయిజం అంటే బూతులు - కబ్జాలా..భరించడం కష్టమే:కాంగ్రెస్ నేతలు

By:  Tupaki Desk   |   20 March 2020 11:02 AM GMT
రేవంత్ హీరోయిజం అంటే బూతులు - కబ్జాలా..భరించడం కష్టమే:కాంగ్రెస్ నేతలు
X
హీరో అంటే జనంలో నుంచి పుడతారు - జనంలో మధ్యలో ఉంటారు - జనం గుండెల్లో ఉంటారు. రాజకీయాలలో హీరో కావాలి అంటే అనుకున్నంత సులభం కాదు. కానీ, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో భిన్నమైన వైఖరి కనిపిస్తోంది. పార్టీలో రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలు కాంగ్రెస్ పార్టీ నేతలనే కలవరపెడుతున్నాయి. దీనితో సొంత పార్టీలోనే రెండు వర్గాలు తయారైయ్యారు. పార్టీ ఎంపీగా ఉండి వ్యక్తిగత కక్షలకు దిగుతున్నారనే వాదన బలంగా ఉంది.

రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు.. బయటకు వచ్చిన తర్వాత కూడా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం పలకరింపుగా కూడా రాలేదు. అదంతా ఎందుకు అసలు పార్టీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ ని కలవడానికి రాలేదు. దీని అంతటికీ కారణం రేవంత్ వ్యక్తిగత కక్షపూరిత రాజకీయమే అని కొందరు చర్చించుకుంటున్నారు. పొలిటికల్ హీరోయిజం అంటే కబ్జాలు చేయటమా.. హీరోయిజం అంటే ఫోర్జరీ సంతకాలు చేయటమా.. రాజకీయం అంటే చట్టాలను అడ్డుపెట్టుకుని బేరాలు - బెరిదింపులకు పాల్పడటమా.. పదవి అంటే ఓటుకు నోటు కుట్రలా.. తెగింపు అంటే రెచ్చిపోవటమా.. విమర్శించటం అంటే ప్రత్యర్దులని బూతులు తిట్టటమా.. ఏంటి అసలు రేవంత్ రెడ్డి వ్యవహారం - ఏం జరుగుతుంది పార్టీలో.

ఓ వ్యాపారవేత్తతో రేవంత్ రెడ్డి పగతీర్చుకోవటాన్ని పార్టీకి ముడిపెట్టటం ఏంటీ - దీనిపై సీనియర్ నేతలు సైతం అసహనంలో ఉన్నారు. సొంత సోషల్ మీడియాలో ఓ ప్రముఖ వ్యాపార వేత్తను టార్గెట్ చేసుకుంటూ విచ్చలవిడిగా ఆరోపణలు - విమర్శలతో తన హీనబుద్దిని - రేవంత్ రెడ్డి చూపించటంతో తెలంగాణ ప్రజల్లోనూ చర్చనీయాంశం అయ్యింది. మీ అమ్మాయి వెనుక ఒకబ్బాయి వెంట పడితే - మీరు అతన్ని హీరోగా ఫీలై - ఇంటికి పిలిచి మాట్లాడతారా.. లేక నాలుగు తగిలిస్తారా..? మనుషులం అయితే నాలుగు తగిలిస్తారు.. దిశ చట్టం కింద అరెస్ట్ చేసి బొక్కలోవేస్తాం. ఇప్పుడు జరుగుతున్నది ఏంటీ.. పార్టీలో రేవంత్ వ్యవహార శైలి కూడా ఇలాగే ఉంది.

ఓ జాతీయ పార్టీ ఎంపీ అయ్యి ఉండి.. వ్యక్తిగత కక్షలతో నోరు పారేసుకోవటం - విష ప్రచారం చేయటాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు తెలంగాణ ప్రజలు - కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇలాగే వదిలేస్తే మరింత బరితెగించి.. పార్టీని మరింత భ్రష్టుపట్టించటం ఖాయం అని పార్టీలోని సీనియర్ నేతలు అంటున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియాగాంధీకి కూడా కంప్లయింట్ చేసారని సమాచారం. రేవంత్ వైరస్ ను కంట్రోల్ లో పెట్టాలని లేకపోతే మరింత వ్యాప్తిచెంది పార్టీకి చాలా నష్టం చేకూర్చుతుంది అని సీనియర్ నేతలు ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది.