Begin typing your search above and press return to search.

హుజూర్‌ న‌గ‌ర్‌: మూడు రోజుల్లోనే రివ‌ర్స్ జంపింగ్‌ లా!

By:  Tupaki Desk   |   29 Sep 2019 8:35 AM GMT
హుజూర్‌ న‌గ‌ర్‌: మూడు రోజుల్లోనే రివ‌ర్స్ జంపింగ్‌ లా!
X
హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో అన్ని ప్ర‌ధాన పార్టీల్లో హైటెన్ష‌న్ నెల‌కొంది. నామినేష‌న్ల ప్ర‌క్రియ సోమ‌వారంతో ముగియ‌నుండ‌గా - ఇక అన్ని పార్టీలు ప్ర‌చారంపైనే దృష్టి పెట్ట‌నున్నారు. అధికార టీఆర్ ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మంకంగా భావిస్తోంది. సీఎం కేసీఆర్ మొత్తం 60 మంది పార్టీ ఇన్‌ చార్జిల‌ను హుజూర్‌ న‌గ‌ర్‌ కు పంపారు. వీరంతా ఇప్ప‌టికే త‌మ‌కు కేటాయించిన మండ‌లాల‌కు చేరుకున్నారు.

వీరంద‌రినీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌ ఇన్‌చార్జిగా ఉన్న ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌ రెడ్డి స‌మ‌న్య‌యం చేస్తున్నారు. కాగా హుజూర్‌ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ఆవిర్భావం నుంచి మూడు ప‌ర్యాయాలు ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే టీఆర్ ఎస్ ఒక్క‌సారి కూడా విజ‌యం సాధించ‌లేదు. దీంతో ఎలాగైనా ఈసారి హుజూర్‌ న‌గ‌ర్‌ లో గులాబీ జెండా ఎగుర‌వేయాల‌ని ఆ పార్టీ తీవ్రంగా శ్ర‌మిస్తోంది. అందివ‌చ్చిన అన్ని అవ‌కాశాల‌ను వినియోగించుకుంటోంది.

ఇందుకోసం ఇత‌ర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ‌ల‌స‌ల‌ను ప్రోత్స‌హించి - ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి నాయ‌కుల‌ను టీఆర్ ఎస్‌ లో చేర్చుకునే ప్ర‌క్రియ‌ను వేగంగా అమ‌లు చేస్తున్నారు. హుజూర్‌ న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో మొత్తం ఏడు మండ‌లాలు ఉన్నాయి. ఐదుగురు జెడ్పీటీసీ స‌భ్యులు - న‌లుగురు ఎంపీపీలు టీఆర్ ఎస్‌ కు చెందిన వారు ఉన్నారు. కాగా పాల‌క‌వీడు కాంగ్రెస్ జెడ్పీటీసీ మూడు రోజుల క్రితం కేటీఆర్ స‌మ‌క్షంలో గులాబీ కండువా క‌ప్పుకున్నారు. కేవ‌లం మూడు రోజుల వ్య‌వ‌ధిలోనే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో ఇక్క‌డ రాజ‌కీయం మామూలుగా హీటెక్క‌డం లేదు.

మండ‌లానికి ఒక‌రిద్ధ‌రు మిన‌హా.. కాంగ్రెస్ మ‌ద్ద‌తుదారులైన ప్ర‌జాప్ర‌తినిధులు - స‌ర్పంచ్‌ లు ఒక్కొక్క‌రుగా టీఆర్ ఎస్ గూటికి చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేత‌ల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది. ఓ వైపు ప్ర‌చారంలో పాల్గొంటూనే - మ‌రోవైపు చేజారిపోయే నాయ‌కుల‌ను ఓకంట క‌నిపెడుతూ - కాపాడుకోవ‌డం కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు క‌ష్టంగా మారింది.