Begin typing your search above and press return to search.
రేవంత్ కు ఇచ్చే పదవులపై కాంగ్రెస్‌లో టెన్షన్
By: Tupaki Desk | 29 Oct 2017 5:30 PM GMTఇన్నాళ్ల ట్విస్టులకు తెరదించుతూ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. ఇప్పటి వరకు చేరికపై జరిగిన ప్రచారానికి బ్రేక్ పడింది. అయితే తదుపరి రేవంత్ అడుగులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకీ రేవంత్ ఎప్పుడు పార్టీ కండువా కప్పుకుంటారు.? ఆయన చేరికకు ముహుర్తం ఎప్పుడు? రాహుల్ గాంధీ సమక్షంలో చేరుతారా? లేక ఆయన ప్రత్యేకంగా బహిరంగ సభ నిర్వహించి చేరుతారా? కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీనికి తోడుగా..ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్లలో కలకలం కూడా మొదలైందని సమాచారం.
రేవంత్ చేరికకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో..రెండు అంశాలు తెరమీదకు వస్తున్నాయి. మొదటిది ఈ నెల ముప్పై ఒకటో తేదీన ఢిల్లీలో రాహుల్ సమక్షంలో చేరనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 9న వరంగల్ జిల్లా(హన్మకొండ)లో కాంగ్రెస్ తలపెట్ట్గిన గిరిజన - రైతు గర్జనకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగానే రేవంత్ రెడ్డి చేరితే రాహుల్ గాంధీ సమక్షంలో చేరతారని అంటున్నారు. రేవంత్ రెడ్డి చేరిక తర్వాత భవిష్యతులో జరిగే పరిణామాలపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ లేదా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ ఇవ్వచ్చనే ఉహగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీ సీనియర్ నేతలకు పదవుల ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆయనకు కీలక పదవి మాత్రం ఇస్తారన్న ప్రచారాన్ని కొంత మంది జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది నేతలు ఉన్నా, ఆయనతో పార్టీకి అదనంగా ఒరిగేదేముందని, ఆయనకున్న బలమెంత, ఆయన రాక కాంగ్రెస్ పార్టీకి ఎంత వరకు కలిసొస్తుందన్న చర్చ నడుస్తున్నది.
ఈ పరిణామాలతో కాంగ్రెస్ లోని సీనియర్లు ఒకింత అసంతృప్తిగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే రేవంత్ పార్టీలో చేరిన తర్వాత పదవుల పంపకంపై ఆలోచన చేయవచ్చని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. డైరెక్టుగా రాహుల్ గాంధీతో డీల్ చేస్తుండడంతో నేతలు మాట్లాడకలేకపోతున్నారని..గుంభనంగా సన్నిహితులతో చర్చిస్తున్నారని సమాచారం.