Begin typing your search above and press return to search.
కేసీఆర్ యాగంపై కాంగ్రెస్ కు మంటెందుకు?
By: Tupaki Desk | 24 Dec 2015 7:06 AM GMTకేసీఆర్ తన వ్యవసాయం క్షేత్రంలో నిర్వహిస్తున్న అయుత చండీయాగంపై కాంగ్రెస్ పార్టీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ఆ పార్టీ జాతీయ నేతల నుంచి తెలంగాణ నేతల వరకు అందరూ యాగాన్ని విమర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ కానీ, టీడీపీ కానీ యాగంపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమం కావడం.. పైగా సెంటిమెంటు - విశ్వాసాలకు సంబంధించి కావడంతో దాన్ని రాజకీయాలతోఎవరూ ముడిపెట్టలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం కేసీఆర్ యాగంపై విరుచుకుపడుతోంది. సోనియా సహా కాంగ్రెస్ ప్రముఖులకు ఆహ్వానాలు అందకపోవడమే దానికి కారణమని తెలుస్తోంది. ఆ అక్కసుతోనే కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారని అంటున్నారు.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కేసీఆర్ యాగంపై విరుచుకుపడ్డారు. డిగ్గీ రాజా ట్విట్టర్ లో దీనిపై బుస కొట్టారు. ఒక వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కోట్లు ఖర్చు పెట్టి యాగం చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. సొంత ఖర్చుతో యాగం చేస్తున్నానంటున్న కేసీఆర్ కు ఇంత డబ్బు ఎక్కడినుండి వచ్చిందో లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు
ఇంతకు ముందు మల్లు భట్టివిక్రమార్క కూడా యాగానికి మతం రంగు పులిమారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒక్క మతాన్ని మాత్రం ప్రోత్సహించేదిగా ఉందని ఆయన విమర్శించారు. అయితే దానికి టీఆర్ ఎస్ కిందిస్థాయి నేతలు గట్టి కౌంటరే ఇచ్చారు. ఒకప్పుడు సీఎం హోదాలో వైఎసె జెరూసలేం వెళ్లినప్పుడు ఇలానే ఎందుకు విమర్చించలేదన్నారు. ఇక కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కేసీఆర్ యాగంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీలను ముంచడానికే యాగం చేస్తున్నారని ఆరోపించారు. చండీయాగంతో సిఎం కేసీఆర్ కు సద్బుద్ది రావాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీలు పొన్నం - వివేక్ - రాజగోపాల్ రెడ్డిలూ కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.