Begin typing your search above and press return to search.
రంగు పడుతోంది...
By: Tupaki Desk | 22 Nov 2018 11:03 AM GMTతెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకి రాజుకుంటోంది. నాయకులు తమ నియోజకవర్గాలలో ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. డిశంబర్ 7వ తారీఖున తెలంగాణలో జరిగే ముందస్తుకు అంతా సిద్దపడుతున్నారు. ఎన్నికల సంఘం కూడా తామూ రాజ్యంగానికి లోబడి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది. ఎన్నికలకు పకడ్బందిగా ఏర్పట్లు జరిగాయని - ఎన్నికలను చాల పారదర్శకతతో నిర్వహిస్తామని తెలిపింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మేషీన్స్) మీద గులాబి బ్యాలట్ పేపర్లను తొలగించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రంగు గులాబి కాబట్టి - ఓటర్లను ఆ రంగు ప్రభావితం చేసే అవకాశం ఎక్కవగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో ఈవీఎంలపై అతికించి ఉండే 9 లక్షల గులాబి వర్ణంలో ఉండే బ్యాలట్ ప్యాపర్స్ ని సేకరించాలని పేర్కొంది. పార్టీ గుర్తులు - రంగు మొదలైన అంశాలు ఓటర్లను చాలా ప్రభావితం చేస్తాయని - చివరి నిమిషంలో ఆ పార్టీ రంగు చూసి ఓటరు మనసు మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది.
గత మున్సిపల్ ఎన్నికలలో "NOTA" నన్ ఆఫ్ ది ఎబవ్ బటన్ దగ్గర గులాబి రంగు ఉండడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ బటన్ దగ్గర గులాబి రంగు ఉంటే అది తెరాసా బటన్ గా ఓటరు పొరపాటు పడి బటన్ నొక్కె అవకాశం ఉందంటూ పేర్కన్న విషాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఈసీకి గుర్తు చేసింది. ఇదే విషమమై ఎన్నికల అధికారి రాజత్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ విన్నవించింది. అయితే ఈ విషయంతో తామూ ఏమీ చేయలేమని, ఈవీఎంలపై అంటించిన గులాబి రంగు బ్యాలట్ పేపర్లు పీపుల్స్ ఎక్ట్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని పేర్కొన్నారు, ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు న్యాయస్దానాన్ని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నాట్లు తెలుస్తోంది.