Begin typing your search above and press return to search.
రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి రాకపోవడానికి కారణం ఎవరు?
By: Tupaki Desk | 20 May 2020 3:30 PM GMTకాంగ్రెస్.. ఒక అంతులేని పెద్ద సముద్రం.. అందులోకి అన్ని కాలువలు కలవాల్సిందే.. కానీ ఆ సముద్రం మాత్రం కదలదు.. మెదలదు.. ఎక్కడికి పోదూ.. ప్రజారాజ్యం లాంటి చిన్నా చితక పార్టీలెన్నో కాంగ్రెస్ లో కలిసిపోయాయి. ఎన్నో పార్టీల నుంచి వచ్చిన నేతలు కాంగ్రెస్ లో ఇమిడిపోయారు. స్వతహాగా కాంగ్రెస్ వాదులకు తప్పితే బయట నుంచి వచ్చిన వారు కాంగ్రెస్ లో ఎదిగిన వారు బహు స్వల్పమే. ఉద్దండపిండాల్లాంటి కాంగ్రెస్ కురువృద్ధులను కాదని.. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్ అధిష్టానం అందలం ఎక్కించాలని చూసినా.. ఉన్న సీనియర్లు మోకాలడ్డే పరిస్థితి ఆ పార్టీలో ఉంటుంది.
టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని ఐదేళ్లు పూర్తయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తాడనే ఉద్దేశంతో పొన్నాల లక్ష్మయ్య స్థానంలో ఉత్తమ్ ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కాంగ్రెస్ ను విజయం దిశగా నడిపించలేకపోయారు. ఘోరంగా విఫలమయ్యాడు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని ఎన్నికల్లోనూ ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఓడిపోయింది. స్వయంగా ఆయన గెలిచిన హుజూర్ నగర్ లోకూడా కాంగ్రెస్ ను ఉత్తమ్ గెలిపించలేకపోయాడు. గత తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఓటమితో ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి.. హైకమాండ్ కూడా దీనిపై సమాలోచనలు చేసింది. రేవంత్ రెడ్డి కొత్త టీపీసీసీ చీఫ్ అవుతారని బాగా ప్రచారం జరిగింది. మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి.
అయితే నోటికాడిదాకా వచ్చిన పీసీసీ పదవి రేవంత్ రెడ్డికి అందకుండా పోయింది. అసలేం జరిగింది? దాదాపు ఖాయమైందనుకున్న పోస్టు ఎవరి వల్ల రద్దు అయ్యిందనేది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోనియా, రాహుల్ గాంధీలు రేవంత్ రెడ్డిని ఉత్తమ్ ప్లేస్ లో దాదాపు ఖాయం చేయగానే కాంగ్రెస్ సీనియర్లు రంగంలోకి దిగినట్టు తెలిసింది. ముఖ్యంగా నల్గొండ సీనియర్లు జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, దామోదర్ రెడ్డి, ఇక వీహెచ్, జీవన్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ లో ఆది నుంచి ఉన్న వారికే పీసీసీ పీఠం ఇవ్వాలని.. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి వీల్లేదని తిరుగుబావుటా ఎగురవేసినట్టు సమాచారం.
ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్లు, పెద్దలు రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కకుండా చక్రం తిప్పారని తెలిసింది. రేవంత్ రెడ్డి ఇప్పటికీ తన గాడ్ ఫాదర్ అయిన మాజీ బాస్ టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లో ఉన్నాడని కాంగ్రెస్ అధిష్టానానికి ఉప్పందించారట.. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇస్తే.. చంద్రబాబే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తాడని అని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్లు సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారని.. అందుకే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ పదవి ఇవ్వలేదని సమాచారం. ఇక మరొకరికి ఇచ్చినా ఇప్పుడు లేని గొడవలు సృష్టించినట్టు అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డినే ఈ కష్టకాలంలో కొనసాగించాలని డిసైడ్ అయినట్లు సమాచారం.
మొత్తంగా టీడీపీని వీడి ఎన్నో ఆశలతో కాంగ్రెస్ నావ ఎక్కిన రేవంత్ కు కష్టాలు తప్పడం లేదు. మాజీ బాస్ చంద్రబాబుతో ఆయన సాన్నిహిత్యం కాంగ్రెస్ లో ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. కాంగ్రెస్ సీనియర్లు ఈ యువ రేవంత్ ను అడుగడుగునా తొక్కేస్తూనే ఉన్నారు. మరి ఇన్ని కష్టాలు దాటి రేవంత్ పీసీసీ పగ్గాలు అందుకుంటాడా లేదా అన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న.