Begin typing your search above and press return to search.
ఏపీ కాంగ్రెస్ కు కొత్త బాస్ వస్తున్నాడు..!
By: Tupaki Desk | 11 Jan 2016 5:53 AM GMTఏపీలో అవసాన దశలో కునారిల్లుతున్న ముసలి కాంగ్రెస్ కు కొత్త బాస్ వస్తున్నాడనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి కాస్తో కూస్తో ఏపీలో పట్టుకోసం ట్రై చేస్తోన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏపీకి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను నియమించే ఆలోచనలో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు మల్లు భట్టివిక్రమార్కను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం ద్వారా అక్కడ రెడ్డి+దళిత సమీకరణ రూపొందించారు. ఇప్పుడు ఏపీలో కూడా అలాగే చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట.
ప్రస్తుతం ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రఘువీరారెడ్డి కొనసాగుతున్నారు. రఘువీరా బీసీ (యాదవ) సామాజికవర్గానికి చెందిన వారు. ఇప్పుడు రఘువీరాకు సాయంగా ఇక్కడ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇస్తే వీరిద్దరు కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకోసం రఘువీరాతో సన్నిహిత సంబంధాలు ఉన్న కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మినహా మరో వ్యక్తి ఎవ్వరూ కాంగ్రెస్ కు కనపడడం లేదు.
అలాగే రఘువీరా రాయలసీమకు చెందిన వ్యక్తి కాగా...కోట్ల కూడా సీమకే చెందిన వ్యక్తి కావడంతో ఇప్పుడు ఆయన స్థానంలో పార్టీలో మరో ప్రాంతానికి చెందిన నేతకు అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తోంది. ఇందుకోసం శైలజానాథ్ - కొండ్రు మురళి - పనబాక లక్ష్మి పేర్లు పరిశీలిస్తున్నారు. అయితే వీరిలో శైలజానాథ్ కూడా అనంతపురం జిల్లాకే చెందిన వ్యక్తి. ఉత్తరాంధ్రకు ఈ పదవి ఇవ్వాలంటే కొండ్రు పేరు పరిశీలనలో ఉంది. ఇక నెల్లూరు జిల్లా నుంచి పనబాక లక్ష్మి కూడా రేసులో ఉన్నారు. లేదా ఓసీ మహిళకు ఈ పదవి ఇవ్వాలంటే మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణికైనా అవకాశం దక్కవచ్చునని తెలుస్తోంది. ఫైనల్‌గా ఏపీ కాంగ్రెస్ కు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైనా వచ్చే నెలలో ఈ పదవి మాత్రం ఎవరికో ఒకరికి దక్కడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.