Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర డబ్బుల్లేవా?
By: Tupaki Desk | 24 April 2016 4:47 AM GMTడబ్బు విషయంలో రాజకీయపార్టీలు ఎంత కటువుగా ఉంటాయో తాజా ఉదంతం చూస్తే అర్థమవుతుంది. పార్టీ బ్యాలెన్స్ షీట్లో వందలాది కోట్ల రూపాయిలు ఉన్నట్లుగా తాము సమర్పించే నివేదికల్లో చెప్పుకున్నా.. రూపాయి బయటకు తీసేందుకు మాత్రం అస్సలు ఇష్టపడరన్న విషయం మరోసారి స్పష్టమైంది. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరగనున్న పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆర్థిక సమస్య వెంటాడి వేధిస్తోంది. పదేళ్లు నాన్ స్టాప్ గా పవర్ ఎంజాయ్ చేసిన పార్టీ.. రెండేళ్లు ప్రతిపక్షంలో కూర్చుంటే గల్లాపెట్టె ఖాళీ అయిన చందంగా చెబుతున్న మాటల్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.
పాలేరు ఉప ఎన్నికల బరిలో దించేందుకు దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణిని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోరగా.. బరిలోకి దిగేందుకు తమకు ఇబ్బంది లేదని.. కాకుంటే ఆర్థికంగా చేయూత ఇవ్వాలంటూ రాంరెడ్డి ఫ్యామిలీ స్పష్టం చేసింది. దీంతో.. ఎన్నికల ఖర్చు అంశాన్ని అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు.
ఆర్థికంగా చేయూతనిచ్చే పరిస్థితుల్లో తాము లేమని తేల్చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం మాటతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ తగులుకుంది. మొత్తంగా కాకున్న ఎంతోకొంత మొత్తమైనా ఢిల్లీ నుంచి వస్తుందని ఆశించిన కాంగ్రెస్ నేతలకు నిరాశే మిగిలింది. నిధుల సమీకరణ విషయాన్ని రాష్ట్ర పార్టీనే చూసుకోవాలన్న మాటతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాలేరు ఉప ఎన్నిక ఖర్చు మీద దృష్టి పెట్టాలని నిర్ణయించింది. పదేళ్లు నాన్ స్టాప్ గా పవర్లో ఉన్న జాతీయ పార్టీ దగ్గర డబ్బుల్లేవన్న మాట చూస్తే విస్మయం చెందక తప్పదు. ఒక ఉప ఎన్నిక ఖర్చును కూడా మోసే స్థోమత లేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందనటం ఆశ్చర్యకరంగా అనిపించట్లేదు..?