Begin typing your search above and press return to search.
ఎత్తులకు 'పొ' (పై) త్తులు
By: Tupaki Desk | 23 Jan 2019 10:38 AM GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోజురోజుకు కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తీవ్రంగా నష‌్టపోయినా కాంగ్రెస్ పార్టీ... ఆంధ్రప్రదేశ్ లో పొత్తుకు సంబంధించి ఆలోచనలో పడింది. తెలంగాణలో కాంగ్రెస్‌కు కాస్తో - కూస్తో ఓట్ బ్యాంకు ఉందని - కాని తెలుగుదేశం పార్టీతో కలవడం వల్లే తామూ ఓటమి పాలైయ్యామన్నది కాంగ్రెస్ నాయకుల వాదన. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టిడిపీతో పొత్తు వద్దని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఉమాన్ చాందీ - ఈ మేరకు కాంగ్రెస్ ఇతర నేతలు నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. టిడిపీతో పొత్తుకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకులు విముఖత చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ఆంధ్ర్రప్రదేశ్ లో టిడీపీతో కలసి వెళ్లాలా వద్దా అని కాంగ్రెస్ అధిష్టానం ఇంకా ఒక అభిప్రాయానికి రాలేదని కొందరు నాయకులు అంటున్నారు.
అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం తామూ రాబోయే ఎన్నికలలో జనసేనతో కలసి పోటీ చేస్తామని అంటున్నారు. దీనిపై జనసేనతో ఏకాభిప్రాయానికి కూడా వచ్చామని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ నాయకుడు టిజీ వెంకటేష్. తమ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పొత్తులపై పవన్ కల్యాణ్ తో చర్చించనున్నారని ఆయన అన్నారు. అయితే మరో తెలుగుదేశం నాయకుడు మాత్రం జనసేనతో పొత్తుపై చంద్రబాబు నాయకుడు తమతో ఏమి చెప్పలేదని అన్నారు. ఇలా పొత్తులుపై ఒక్కో నాయకుడు ఒకో అభిప్రాయాన్ని వెలుబచ్చుతున్నారు. ఏదీ ఏమైతేనేం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజుకో కొత్త మలుపుతో మంచి రసవత్తంగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.