Begin typing your search above and press return to search.
అట్టర్ ఫ్లాప్ అయిన చోట ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?
By: Tupaki Desk | 6 May 2019 7:37 AM GMTగత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విఫల గాథ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన చరిత్రలో ఏనాడూ ఎదుర్కోనంత పతనావస్థను ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా సంపాదించుకోలేకపోయింది. ఒకవైపు భారతీయ జనతా పార్టీ, మరోవైపు ప్రాంతీయ పార్టీలు అప్పుడు కాంగ్రెస్ ను తలెత్తుకోలేని స్థాయి వైఫల్యంలోకి నెట్టేశాయి. దానికి అనేక కారణాలు.
అలా కాంగ్రెస్ బాగా చిత్తు అయిన సీట్లు కొన్ని ఉన్నాయి. వాటికే ఈ రోజు పోలింగ్ జరుగుతూ ఉంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ లో భాగంగా నేడు ఓటింగ్ సాగుతున్న యాభై ఒక్క ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో నెగ్గింది రెండంటే రెండు సీట్లలో మాత్రమే.
ఆ రెండింటిలో నెగ్గడమే కాంగ్రెస్ కు అప్పుడు గగనం అయిపోయింది. మరి అలాంటి చోట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అనేది ఆసక్తిదాయకమైన అంశం అవుతోంది. ఐదేళ్ల కింద ఇవే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చేశారు ప్రజలు. ఈ సారి వారు ఎలా తీర్పు ఇస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది.
ఇలా ఈ రోజు ప్రజా తీర్పును ఓట్ల రూపంలో పొందబోతున్న వాళ్లలో సోనియాగాంధీ - రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. వారితో పాటు వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఈ రోజు పోటీలో ఉన్నారు.
ఈ రోజు పోలింగ్ జరుగుతున్న కొన్ని నియోజకవర్గాలపై మాత్రం కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. అవన్నీ మధ్య ప్రదేశ్ - రాజస్తాన్ రాష్ట్రాల్లోని నియోజకవర్గాలు. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇటీవలే మంచి ప్రదర్శనను ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆ రాష్ట్రాల్లో మెరుగైన స్థాయిలో సీట్లను పొందే ఆశాభావంతో ఉంది కమలం పార్టీ!