Begin typing your search above and press return to search.

గద్దర్‌ ను గందరగోళంలో పడేసిన కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   19 Nov 2018 6:07 PM GMT
గద్దర్‌ ను గందరగోళంలో పడేసిన కాంగ్రెస్‌
X
ప్రజా యుద్ధనౌక..తెలంగాణ‌లో ఈ కీర్తి ఎవ‌రికి ద‌క్కిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఉద్య‌మ‌కారుడు గ‌ద్ద‌ర్‌ ను ఈ పేరుతో పిలుచుకుంటారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న తెలంగాణ ఎన్నిక‌ల్లో ఆయ‌న ప‌రిస్థితి గంద‌ర‌గోళంలో ప‌డిపోయింద‌ని అంటున్నారు. ఉద్య‌మ‌పంథాను వీడిన గద్దర్‌ ఈ ఎన్నికల్లో బరిలో దిగాలని ఆకాంక్షించినప్పటికీ ఆయనకు ఆశించిన ఫలితం దక్కలేదని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటుగా ఆయన తనయుడు సూర్యం బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించినప్పటికీ కూటమి పేరుతో కాంగ్రెస్‌ మొండిచేయి చూపరాని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఇటు త‌న‌కు అటు త‌న కుమారుడికి అన్యాయం జ‌రిగింద‌నే భావ‌న‌లో గ‌ద్ద‌ర్ ఉన్న‌ట్లు చెప్తున్నారు.

వామ‌ప‌క్ష ఉద్యమ నేపథ్యం ఉన్న గద్దర్ కొద్దికాలం క్రితం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టీఆర్‌ ఎస్‌ పార్టీ అధినేత - ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నుంచి బరిలో దిగుతానని, స్వతంత్య్రంగా పోటీ చేస్తున్న తనకు ఆయా పార్టీలు మద్దతు ఇవ్వాలని గద్దర్‌ కోరారు. అనంతరం తాను పోటీ చేయబోనని - ప్రచారం మాత్రం చేస్తానని ఆయన వివరించారు. అయితే, తాజాగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఇచ్చిన స్టార్‌ క్యాంపైనర్ల జాబితాలో గద్దర్‌ పేరు లేదు. అదే సమయంలో ఆయన్ను ప్రచారానికి సైతం ఆహ్వానించడం లేదు. దీంతో గద్దర్‌కు ఇటు అవకాశం ఇవ్వకుండా మరోవైపు ఆయన సేవలను వాడుకోకుండా కాంగ్రెస్‌ పార్టీ తన మార్కును చూపిందంటున్నారు.

మ‌రోవైపు ఆయ‌న కుమారుడికీ మొండిచెయ్యి చూపించార‌ని అంటున్నారు. ఢిల్లీ పెద్దలను గద్దర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, తన కుమారుడు సూర్యంకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టికెట్‌ హామీ పొందారు. కానీ కాంగ్రెస్‌ సారథ్యంలోని మహాకూటమి ఆ టికెట్‌ ను సీపీఐకి కేటాయించింది. దీంతో సూర్యంకు టికెట్‌ దక్కలేదు. కాగా ఈ పరిణామంతో గద్దర్‌ సానుభూతిపరులు షాక్‌ కు గురయ్యారని అంటున్నారు. ఇటు పార్టీ పరంగా ఆన సేవలను వాడుకోకుండా మరోవైపు హామీ ఇచ్చినట్లు టికెట్‌ ఇవ్వకుండా గద్దర్‌ ను కాంగ్రెస్‌ పార్టీ గందరగోళంలోకి నెట్టేసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.