Begin typing your search above and press return to search.
మోడీని బుక్ చేయబోయి కామెడీ అయిన కాంగ్రెస్
By: Tupaki Desk | 15 Sep 2017 2:28 PM GMTరాజకీయ నాయకుల్లో సోషల్ మీడియాను ఏలుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బుక్ చేయబోయి ప్రతిపక్ష కాంగ్రెస్ నవ్వులపాలయింది. మోడీజీని సోషల్ మీడియాలో ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఒక టీం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ పార్టీ కార్యకలాపాలతో పాటుగా మోడీపై కూడా ఈ టీం శ్రద్ధ పెట్టింది. అయితే ఈ క్రమంలో చేసిన అతి కాస్త అడ్డంగా బుక్ చేసేసేంది. నవ్వుల పాలయింది.
రెండు రోజుల పర్యటనపై వచ్చిన అబేకు అహ్మదాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. తనదైన రీతిలో ఆలింగనం చేసుకుని సాదరస్వాగతం పలికారు. విమానం దిగుతున్నప్పుడు సూటులో కనిపించిన అబే ఆ తర్వాత భారతీయ సాంప్రదాయిక దుస్తులైన కుర్తా-పైజామా ధరించి పైనుంచి నీలిరంగు నెహ్రూ జాకెట్ వేసుకున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీజీ సబర్మతి ఆశ్రమం వరకు అబే దంపతులతో కలిసి ప్రధాని మోడీ సుమారు 8 కిలోమీటర్లు ఓపెన్‌టాప్ వాహనంలో ప్రయాణించారు. అబే దంపతులకు మోడీ సబర్మతి ఆశ్రమం కలయదిప్పి చూపించారు. గాంధీజీ అక్కడి నుంచే జాతీయోద్యమాన్ని నడిపిన తీరును, అహింసాయుతంగా సాగిన జాతీయోద్యమంలో చరఖా ప్రాముఖ్యాన్ని మోడీ వివరించారు. గాంధీజీ స్మారకం వద్ద అబే దంపతులు నివాళులు అర్పించారు.
అయితే ఈ ఎపిసోడ్ ను కాంగ్రెస్ టీంలోని ఒక బృందం ఉపయోగించుకుంది. ప్రధాని అబే దంపతులు నివాళి అర్పించినప్పటికీ మోడీజీ మాత్రం జాతిపితను గౌరవించలేదని ఈ టీం ఓ మార్ఫింగ్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. అయితే దీన్ని బీజేపీ సారథ్యంలోని బృందం తిప్పికొట్టింది. ఓ ఛానల్‌లో వచ్చిన క్లిప్పింగ్‌ను పేర్కొంటూ ఇదే కాంగ్రెస్ మార్క్ శక్తిసామర్థ్యాలు చెప్తున్నాయని ఎద్దేవా చేసింది. మొత్తంగా బుక్ చేయబోయి నవ్వుల పాలయింది.