Begin typing your search above and press return to search.

నగ్మాకు స్వపక్షమే గోతులు తవ్వుతోందట

By:  Tupaki Desk   |   31 March 2016 7:39 AM GMT
నగ్మాకు స్వపక్షమే గోతులు తవ్వుతోందట
X
తన అందచందాలతో తెలుగు.. తమిళ చిత్ర రంగాల్లో ఒక ఊపు ఊపేసిన నగ్మా గుర్తుందా? సినిమాలు వదిలేసి.. కాంగ్రెస్ పార్టీలో హుషారుగా సాగుతున్న ఆమె.. గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో నిలిచారు. తాజాగా తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాలని తపిస్తున్నారు. అయితే.. ఆమె అనుకున్నట్లుగా జరగటానికి పరిస్థితులు అనుకూలంగా లేవు.

ఆమె రాకను మిగిలిన వారి కంటే తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేతలే విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమె బరిలోకి నిలవటానికి అవకాశం ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణంగా తీవ్ర అసహనానికి గురి చేసింది. అది ఎంతలా అంటే.. సొంత పార్టీ నేతలపై ఆమె ఫైర్ అవుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానని.. మైలాపూర్ లో పోటీకి తాను రెఢీ అయినప్పటికీ.. సొంత పార్టీ వారే అడ్డుకుంటున్నారని వాపోయారు. తనను ఎన్నికల్లో నిలబడకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె వాపోయారు.

తమిళనాడురాష్ట్రంలో ఆమెకు ఓటు హక్కు లేకున్నా.. ఎమ్మెల్యే కావాలన్న ఆశ పడుతున్న నగ్మాకు.. పోటీగా నటి కమ్ కాంగ్రెస్ పార్టీ నేత అయిన ఖుష్బూ పోటీ అన్న మాట వినిపిస్తోంది. తనకూ ఖుష్బూ మధ్య విభేదాలు లేవని చెబుతున్నా.. అదంతా ఉత్తమాటగా కొట్టిపారేస్తున్నారు. ఎక్కడో ఉత్తరాదికి చెందిన నగ్మా వచ్చి తమిళ రాజకీయాల్లో వేలు పెట్టటం ఏమిటంటూ తమిళ కాంగ్రెస్ నేతలు గుస్సా అవుతున్నారు. ఎవరు మాత్రం ఎవరి అవకాశాలు పోగొట్టుకోవటానికి సిద్ధంగా ఉంటారు.