Begin typing your search above and press return to search.
బాహుబలి సినిమాను నమ్ముకుంటున్న కాంగ్రెస్!
By: Tupaki Desk | 11 April 2016 9:23 AM GMTఅధికార పార్టీ తప్పొప్పులను ప్రశ్నిస్తూ బలపడాల్సిన ప్రతిపక్ష పార్టీ ఆ దిశగా విఫలం అవుతోంది. పదేండ్ల సుదీర్ఘ పాలనలో భాగస్వామ్యులుగా ఉన్నప్పటికీ ఆ పాలన అనుభవాన్ని ఎక్కడా ప్రదర్శించడం లేదు. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ గురించి!. సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు పోటీగా మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని బల్లగుద్ది చెప్పిన కాంగ్రెస్ ఇంకా దానిపై స్పష్టతకు రాలేదు. ఏం చెప్పాలన్న దానిపై క్లారిటీ ఉన్నా… ఎలా చెప్పాలి? ఎవరు చెప్పాలన్నది తేల్చుకోలేకపోతోంది.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తాము చెప్పే దానికి అధికార పక్షం నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందనే దాని కంటే…సొంత పార్టీలో ఏ నేత ఏమంటాడోనన్న భయమే అగ్రనేతల్లో కనిపిస్తోంది. కేసీఆర్ చెప్పిందంతా తప్పని ఒక్క ముక్కలో చెప్పేసిన నేతలకు...ఆ తప్పేంటో నిర్ణయించడానికి పది రోజులైనా సరిపోవడం లేదు. ఇప్పటికే ఈ వ్యవహారంపై నాలుగైదు సార్లు సీనియర్ నేతలు ఇంజినీరింగ్ నిపుణులతో సమావేశమయ్యారు.
ఇన్ని సమావేశాలు పెట్టడానికి కారణం ఏంటంటే…. అందర్నీ పిలిచి ఏం చెప్పాలో అడిగితే తర్వాత ఎవరూ దానిపై విమర్శించకుండా ఉంటారట… అందుకే ఇన్నిసార్లు, ఇన్ని సమావేశాలు పెడుతున్నామని చెబుతున్నారు నాయకులు! ముందు అనుకున్నట్టు ఈ నెల 9న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది…కానీ దాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. ఇంకా ఎన్నిరోజులు పడుతుందంటే… బాహుబలి సినిమాను ఎన్ని రోజులు తీశారు…అయినా జనం చూడలేదా? మా ప్రజెంటేషన్ కూడా అంతే అంటున్నారు. పార్టీలోని ఓ వర్గం నేతలు మాత్రం కేసీఆర్ సిక్సర్లు కొడుతుంటే… మా వాళ్లు కనీసం డిఫెన్స్ కూడా ఆడలేకపోతున్నారంటున్నారు.