Begin typing your search above and press return to search.

ఏపీ కాంగ్రెస్ ఇక చరిత్రపుట్టల్లోనేనా?

By:  Tupaki Desk   |   15 April 2019 1:30 AM GMT
ఏపీ కాంగ్రెస్ ఇక చరిత్రపుట్టల్లోనేనా?
X
ఏపీలో గెలుపు రెండు పార్టీల చుట్టే తిరుగుతోంది. జనసేన - బీజేపీ ప్రభావం తక్కువే. ఉమ్మడి ఏపీలో చివరగా రెండు సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పరిస్థితి మాత్రం 2019 ఎన్నికల తర్వాత దారునంగా తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీలో పోలింగ్ సరళి చూశాక ఇక బలపడడం సాధ్యంకాదన్న అంచనాలు కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయట.

రాష్ట్రాన్ని విభజించాక ఏపీలో 2014లో భూస్థాపితమైన కాంగ్రెస్ 2019లో కాస్తయినా కోలుకుంటామని కాంగ్రెస్ పెద్దలు భావించారట.. టీడీపీతో పొత్తు పొడవడంతో పొత్తులతో కాంగ్రెస్ మార్క్ కనపడుతుందని ఆశపడ్డారు. కానీ బాబు ఎన్నికల వేళ జాతీయ రాజకీయాల్లో మాత్రమే పొత్తుకు సై అనడం ఏపీలో కాలదనడంతో ఒంటరిపోరుకు కాంగ్రెస్ రెడీ అయ్యింది. తెలంగాణలో పొత్తుపెట్టుకొని దెబ్బతిన్న బాబు ఏపీలో ఆ మాట ఎత్తలేదు. ఇదే సమయంలో సీనియర్ కాంగ్రెస్ నేతలను బాబు లాగేయడంతో కాంగ్రెస్ మరింత కుదేలయ్యింది.

కాంగ్రెస్ లోనే ఉన్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. మెగాస్టార్ చిరు సినిమాలకే పరిమితమయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మాత్రమే ఉన్నారు. రఘువీరారెడ్డి తర్వాత జేడీ శీలం.. పల్లం రాజు కాస్త యాక్టివ్ గా ఉన్నారు. సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్న అంత చురుగ్గా పార్టీలో వ్యవహరించడం లేదు. దీంతో కోమాలో ఉన్న పార్టీకి ముగ్గురు - నలుగురు నేతల వల్ల ఒరిగేదేమీ కనిపించడం లేదు.

2019 ఎన్నికల్లోనూ తీసికట్టుగా తయారైన కాంగ్రెస్ ఫలితాలు వెలువడ్డాక ఇక కాంగ్రెస్ కథ కంచికేనన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.