Begin typing your search above and press return to search.
కాంగ్రెస్.. ఇంత దీనస్థితిలో ఉందా.?
By: Tupaki Desk | 1 March 2019 4:33 AM GMTఒక పెద్ద బస్సు బెజవాడ రోడ్డుపై ఆగింది. దాని వెనుక మూడు మినీ బస్సులు.. ఏంటా దగ్గరికెళ్లి చూస్తే అవి కాంగ్రెస్ ప్రచార బస్సులు.. లోపల కర్టెన్లు కూడా వేసుకోలేదు. ఆబగా చూస్తే ముందున్న పెద్ద బస్సులో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఉన్నారు. మిగతా దిగ్గజ కాంగ్రెస్ నాయకులు లోపలున్నారు. కానీ ఎలాంటి ఉలుకు.. పలుకూ లేదు. అంత సీనియర్ కాంగ్రెస్ నేతలు రోడ్డ మీదకొచ్చినా వారిని పట్టించుకున్న నాథుడు లేడు. బస్సులు ముందు నుంచే పోతున్నా జనాలు కనీసం వారి వంక కూడా చూడడం లేదు. ఇక పెద్ద బస్సు వెనుకున్న మూడు మినీ బస్సులు ఖాళీగానే ఉన్నాయి. కనీసం నాలుగు బస్సులు కూడా నిండని దుస్థితికి 70 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకొచ్చింది. ఏపీలో ఇంత దీన స్థితిలో కొట్టుమిట్టాతున్న కాంగ్రెస్ బతికి బట్టగలదా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూస్తే అందులో 80శాతానికి పైగా కాంగ్రెస్ ఏలుబడే కనిపిస్తుంటుంది. మధ్య తెలుగుదేశం పార్టీ కొన్నాళ్లు పాలించింది.. ఉమ్మడి ఏపీలో ఎంతో మంది ఉద్దండులైన కాంగ్రెస్ నేతలున్నారు.. ముఖ్యమంత్రులుగా కూడా చేశారు. 2014 వరకు కూడా కాంగ్రెస్ వెలుగువెలిగింది. కానీ ఒకే ఒక్క నిర్ణయం కాంగ్రెస్ ను అధ: పాతాళానికి తొక్కేసింది. ఏపీలో నామరూపాల్లేకుండా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఉనికి కోసం ఆంధ్రప్రదేశ్ లో పోరాడుతుందంటే అతిశయోక్తి కాదు.
ఉమ్మడి ఏపీని పాలించిన నీలం సంజీవరెడ్డి - దామోదర సంజీవయ్య - నీలం సంజీవ్ రెడ్డి - కాసు బ్రహ్మానందరెడ్డి - పీవీ నరసింహారావు నుంచి మొదలుపెడితే టీడీపీ ని ఓడించి ఉమ్మడి ఏపీలో ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ రాజశేకర్ రెడ్డి.. ఆయన మరణం తర్వాత వచ్చిన రోశయ్య.. ఇక మొన్నటి చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వరకూ ఉద్దండులైన రాజకీయ నేతలు ఏపీ రాజకీయ ముఖచిత్రంపై ఎంతో ప్రభావశీలంగా ముద్రవేశారు.
అంతటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించి ఘోరమైన తప్పు చేసింది. అదే సమయంలో ఏన్నో ఏల్లుగా పరిష్కారం కాని తెలంగాణ ప్రజల కలను నెరవేర్చింది. కానీ విభజించి ఏపీలో నామరూపాల్లేకుండా పోయింది. చివరి కాంగ్రెస్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ బాల్ వరకూ ఏపీ విభజనను అడ్డుకున్నా ఆయనతో సాధ్యం కాలేదు. విభజన తర్వాత ఏపీ రాజకీయాలను ఏలిన నేతలంతా ఇప్పుడు కనుమరుగయ్యారు. వేరే పార్టీలకు వెళ్లిన నేతలు కొందరైతే.. రాజకీయ సన్యాసం తీసుకున్న వారు మరికొందరున్నారు..
ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ఏపీలో పునరుత్తేజం పొందింది. అదీ కేంద్రంలోని బీజేపీ ఫుణ్యాన్నే. బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తామని హామీనిచ్చి గద్దెనెక్కింది. అనక మరిచిపోయింది. ఇప్పుడా హోదా బూచీ చూపే ఏపీలో కాంగ్రెస్ బలపడాలని చూస్తోంది. చంద్రబాబు - ఏపీ ప్రజలకు హామీనిచ్చి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కాంగ్రెస్ కు ఏపీలో జవసత్వాలు నింపే పనిలో నిమగ్నమయ్యారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఓ చేత్తో కాంగ్రెస్ ను వాడుకుంటూ మరో చేత్తో కాంగ్రెస్ వెలుగువెలిగిన నేతలను తన పార్టీలోకి లాక్కుంటున్నారు. ఇలా బలపడే లోపే కాంగ్రెస్ ను వేళ్లూనుకోకుండా తుంచేస్తూ మాస్టర్ ప్లాన్ వేశారు. ఇది తెలియని రాహుల్ ప్రస్తుతం చంద్రబాబును నమ్ముతూ నిండా మునిగిపోయేందుకు రెడీ అయ్యారు.
ఇలా వెలుగువెలిగిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో అంతర్థానమై.. మళ్లీ పురుడుపోసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. కానీ మన బాబు గారు కాంగ్రెస్ వేళ్లనే కట్ చేసే పనిలో ఉన్నారు. కేంద్రంలో దోస్తీ.. ఏపీలో నాస్తి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎంత చేసినా.. ఎంత తిరిగినా కాంగ్రెస్ ఏపీలో ఉనికి చాటుకోవడం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.