Begin typing your search above and press return to search.
మరుగున పడిపోయిన కాంగ్రెస్ ఆరు వేల హామీ!
By: Tupaki Desk | 8 April 2019 5:55 AM GMTతమకు కేంద్రంలో అధికారాన్ని ఇస్తే ప్రతి పేద కుటుంబానికి నెలకు ఆరు వేల రూపాయల లబ్ధి కలిగేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ హామీని కాంగ్రెస్ గట్టిగా ప్రచారం చేసుకుంటూ ఉంది. పన్నెండు నెలలకు, నెలకు ఆరు వేలరూపాయల చొప్పున ఏడాదికి డెబ్బై రెండు వేల రూపాయల లభ్ధిని కలిగిస్తామని అంటూ కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేసుకొంటున్నారు. ఈ అంశాన్నే వారు ప్రచారంలో హెరెత్తిస్తూ ఉన్నారు.
ఈ ప్రచారం ఎంత వరకూ ప్రయోజనాలను కాంగ్రెస్ కు కలిగిస్తుందనే సంగతిని పక్కన పెడితే..ఏపీ వంటి రాష్ట్రంలో అలాంటి నినాదాలు ఏవీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ను పైకి లేపలేకపోతున్నాయి. ఉత్తరాదిన ఆ ప్రచారం ఎంత వరకూ లాభిస్తుందో కానీ… దక్షిణాదిన, ప్రత్యేకించి కాంగ్రెస్ హామీని ఎవరూ పట్టించుకోవడం లేదు. బహుశా కాంగ్రెస్ కు మించిన స్థాయిలో ఇక్కడి ప్రాంతీయ పార్టీలు హామీలను గుప్పించడం వల్లనో లేక.. కాంగ్రెస్ కు
ఏపీలో ఎలాంటి బేస్ మెంట్ లేకపోవడం వల్లనో కానీ.. నెలకు ఆరు వేల రూపాయల ప్రయోజనాలు అని కాంగ్రెస్ నినదిస్తున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు.రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు చాలా ద్రోహం చేసింది. తెలంగాణలో ఏదో పొడిచేయాలనే లెక్కలను వేసుకుని సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తన తోకకు తనే నిప్పు పెట్టుకుంది.
దీంతో తీవ్రమై ప్రజాగ్రహానికి గురి అయిన కాంగ్రెస్ ఇక మళ్లీ కోలుకోలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గత ఎన్నికల కన్నా దారుణంగా తయారైన వైనం స్పష్టం అవుతోంది. అందుకే కాంగ్రెస్ ఇచ్చిన సంక్షేమ పథకాల హామీలను కూడా ఎవరూ పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు!