Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ అక్కడ మూడున్నాళ్ల ముచ్చటేనా!
By: Tupaki Desk | 28 April 2019 7:38 AM GMTమధ్యప్రదేశ్ లో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పదిహేను సంవత్సరాల తర్వాత ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అన్ని సంవత్సరాల పాలన తర్వాత ఏ ప్రభుత్వం మీద అయినా ప్రజా వ్యతిరేకత సహజమే. అయినప్పటికీ కేవలం తృటిలోనే విజయాన్ని చేజార్చుకుంది బీజేపీ అక్కడ.
పదిహేనేళ్ల బీజేపీ పాలన తర్వాత ఆ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ అధికంగా సాధించింది కేవలం ఐదు అసెంబ్లీ సీట్లే అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలో ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆసక్తిదాయకంగా మారింది. గత లోక్ సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ బీజేపీ స్వీప్ చేసినంత పని చేసింది. ఇరవై తొమ్మిది ఎంపీ సీట్లకు గానూ కేవలం రెండింటిలో మాత్రమే కాంగ్రెస్ నెగ్గింది. మిగతా అన్నింటిలోనూ బీజేపీ జయకేతనం ఎగరేసింది. అంతలా కమలం గాలి అప్పుడు వీచింది.
అసెంబ్లీ ఎన్నికల్లోనేమో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే కాంగ్రెస్ ఊపు అసెంబ్లీ ఎన్నికల వరకే అని, లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ కమలం పార్టీ హవానే ఉండవచ్చని జాతీయ మీడియా వర్గాలు అంటున్నాయి.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో వివిధ రకాల పరిణామాలు సంభవించడం కాంగ్రెస్ పై కొంత వ్యతిరేకత ఏర్పడిందని, లోక్ సభ ఎన్నికల్లో కమలం పార్టీ గట్టిగా పని చేస్తూ.. అసెంబ్లీ ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకునేలా ప్రణాళికలను రచించిందని - కాంగ్రెస్ లోని అంతర్గత విబేధాలు కూడా అప్పుడే బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారేలా ఉన్నాయని ఆ మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది!