Begin typing your search above and press return to search.
కాంగ్రెస్‌కు మొన్నటి పరువు అయినా నిలుస్తుందా?!
By: Tupaki Desk | 21 Jan 2015 5:11 AM GMTఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు ఇప్పుడు కేవలం రెండే పార్టీల మధ్యన జరుగుతున్నట్టుగా ఉంది. ఈ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య జరుగుతున్న పోరులా ఉన్నాయి. అసలు కాంగ్రెస్ అనే ఒక పోటీదారు ఉందన్న విషయంలో కూడా ఢిల్లీ ఆవలి జనాలు మరిచిపోయారనే అనుమానాలు కలుగుతున్నాయి.
సర్వేల్లో కేవలం ఆమ్ ఆద్మీపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది చర్చనీయాంశం అయ్యింది. మరి కాంగ్రెస్ కథేంటి అంటే.. దాదాపు ఏడాది కిందట జరిగిన ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు వచ్చినా కాంగ్రెస్‌కు పరువు నిలబడినట్టేనని విశ్లేషకులు అంటున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలతోనే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అయ్యింది. ఆ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి పోటీ చేసిన షీలా దీక్షిత్ కూడా ఓటమి పాలవ్వడం.. కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ స్థాయికి పరిమితం కావడం జరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీలు సీట్లను పంచేసుకొన్నాయి. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ కోలుకొన్న దాఖలాలు ఏవీ లేవు. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చిత్తు అయ్యింది. మరి ఇప్పుడు ఏమైనా కోలుకొంటుందా? అనేది అనుమానమే.
సర్వేల అంచనాలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ మరోసారి సింగిల్ డిజిట్ స్థాయికే పరిమితం కావొచ్చు. అయితే భారతీయ జనతా పార్టీ కాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ అన్నట్టుగా ఉంది ఢిల్లీలో వాతావరణం. మరి కాంగ్రెస్ కథ ఇక అంతేనేమో!