Begin typing your search above and press return to search.

జగ‌న్‌ కు పోటీ: 1 నుంచి ఇంటింటికీ కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   18 Oct 2017 10:05 AM GMT
జగ‌న్‌ కు పోటీ:  1 నుంచి ఇంటింటికీ కాంగ్రెస్‌
X

ఏపీలో 2014లో చావుదెబ్బ‌తిన్న కాంగ్రెస్ పార్టీ 2019పై ల‌క్ష్యం గురి పెట్టింది. ఎలాగైనా స‌రే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పుంజుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే చోటా మోటా నేత‌ల‌ను చేర్చుకోవ‌డంతోపాటు ప్ర‌జల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని డిసైడ్ అయింది. ఇప్ప‌టికే అధికార టీడీపీ దాదాపు నెల కింద‌ట రాష్ట్రంలో ప్రారంభించిన `ఇంటింటికీ టీడీపీ` త‌ర‌హాలోనే కాంగ్రెస్ కూడా ఇంటింటికీ కాంగ్రెస్ స‌హా ఇంటింటికీ క‌ర‌ప‌త్రం పేరుతో పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మానికి రెడీ అయింది. వాస్త‌వానికి ఆగ‌స్టులో జ‌రిగిన నంద్యాల ఎన్నిక‌లో కానీ, ఆ త‌ర్వాత జ‌రిగిన కాకినాడ ఎన్నిక‌లో కానీ కాంగ్రెస్‌ కు డిపాజిట్లు ద‌క్క‌లేదు. క‌నీసం పుంజుకుంటుంద‌ని భావించినా అదీ జ‌ర‌గ‌లేదు.

దీంతో తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయిన కాంగ్రెస్ పెద్ద ఎత్తున భ‌విష్య‌త్ వ్యూహానికి ప‌దును పెట్టింది. ఈ క్ర‌మంలోనే అటు టీడీపీకి, ఇటు విప‌క్షం వైసీపీకి ధీటుగా న‌వంబ‌రు 1 నుంచి ఇంటింటికీ కాంగ్రెస్ పేరుతో ప్ర‌జ‌ల‌ను క‌ల‌వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ తెలిపారు. ఈ విష‌యాన్ని ఆయ‌న మంగ‌ళ‌వారం మీడియాకు వెల్ల‌డించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని.., ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు ప్రతిపక్షం అడ్డుపడుతోందని నిందలు వేయడం విడ్డూరంగా ఉందని బాబును విమ‌ర్శించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులోనే అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క‌టీ ప్రారంభం కాలేద‌న్నారు.

అభివృద్ధిపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ప్రాజెక్టులను ఎందుకు ఆపారో జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో నవంబరు 1 నుంచి ఇంటింటికి కాంగ్రెస్‌ - ఇంటింటికి కరపత్రం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నోట్ల రద్దు తర్వాత గ్రామాల్లో కనీసం వెయ్యి రూపాయలు కూడా దొరకక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మొత్తానికి కాంగ్రెస్ కూడా ఇంటింటికీ కాంగ్రెస్ నిర్వ‌హించ‌డం అనే నినాదం ఎత్తుకోవ‌డంతో టీడీపీ ఇరుకున ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.