Begin typing your search above and press return to search.
న్యాయపోరాటం.. కేసీఆర్ బీఆర్ఎస్ కు షాకిచ్చిన రేవంత్ రెడ్డి..
By: Tupaki Desk | 19 Dec 2022 12:57 PM GMTకాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తూ అసమ్మతి రాజేస్తున్న కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరోక్షంగా టార్గెట్ చేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి ఈసీ, కేంద్రంలోని బీజేపీ ఆమోదించినా.. రేవంత్ రెడ్డి మాత్రం అడ్డుకునే పనిలో పడ్డారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన పార్టీపై ఢిల్లీ హైకోర్టుకెక్కారు.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా పేరు మారుస్తూ ఎన్నికల కమిషన్ ఇవ్వడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో టీఆర్ఎస్ బంగారు కూలీ పేరుతో నిధులు సమకూర్చుకున్న అంశంపై ఈసీకి రేవంత్ ఫిర్యాదు చేశారు. దానిపై విచారణ జరపాలని అప్పుడే ఆదాయపు పన్ను శాఖకు ఎన్నికల కమిషన్ లేఖ పంపింది. ఈ విషయంపై విచారణ చేయకముందే పేరు మార్పుపై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టులో అదనపు పిటీషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ జరుపనుంది.
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 8న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ అక్టోబర్ 5న పార్టీ సంయుక్త సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంతోపాటు సీఈసీకి కేసీఆర్ లేఖ రాశారు.
ఇటీవలే కేసీఆర్ ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. సర్ధార్ పటేల్ రోడ్డులోని కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు.ఇక ఈ బీఆర్ఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, జేడీఎస్ నేత కుమారస్వామి హాజరయ్యారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. ఢిల్లీలో పార్టీ జాతీయస్థాయి తాత్కాలిక ఆఫీసును ప్రారంభించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తన కొత్త బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఈ ఛాపర్‌ని ఉపయోగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో అతను న్యూఢిల్లీలో బిజెపియేతర మరియు కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని తేలాలని యోచిస్తున్నందున బిజెపికి వ్యతిరేకంగా వారి మద్దతును సేకరించడానికి అనేక ప్రాంతాలకు వెళ్లి అనేక ప్రాంతీయ పార్టీలను కలవనున్నారు. ఇందుకోసం పకడ్బందీగా ముందుకెళుతున్నారు.
అయితే బీఆర్ఎస్ పేరును మార్చినా కూడా దాని వెనుకున్న లూప్ హోల్స్ వెతికీ మరీ రేవంత్ రెడ్డి కోర్టుకు ఎక్కారు. ఈసీ, బీజేపీ అనుమతించినా.. తమను వేధిస్తూ కాంగ్రెస్ ను దెబ్బతీస్తున్న కేసీఆర్ కు ఇలా షాకిచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.