Begin typing your search above and press return to search.
మోడీ ఏ టు జెడ్ స్కాం.. వైరల్
By: Tupaki Desk | 27 Sep 2018 7:54 AM GMTపెద్ద నోట్లు రద్దు చేసి దేశ ప్రజలందరినీ బ్యాంకుల మీద క్యూ కట్టేలా చేసినా.. జీఎస్టీ బాదేసి ప్రజల నడ్డి విరుస్తున్నా.. పెట్రోల్ రేటును పట్టపగ్గాల్లేకుండా పెంచేస్తున్నా మోడీపై పరుష విమర్శలు రావడం లేదు. ఎందుకంటే ఆయనపై ఉన్ల క్లీన్ ఇమేజే కారణం.. కాంగ్రెస్ ఇప్పటికే అవినీతి - కుంభకోణాల సవాసంతో ప్రజల్లో ఇమేజ్ డ్యామేజ్ చేసేసుకుంది. మోడీకి ఈ మకిలి అంటకపోవడంతో ఇన్నాళ్లు ఆయనను ఎవ్వరూ ఏమీ అనలేదు. కానీ ఎప్పుడైతే ‘రాఫెల్’ యుద్ధవిమానాల స్కాం బయటకు వచ్చిందో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మొదలెట్టేసింది. మోడీ సుద్దపూస కాదంటూ రాహుల్ గాంధీ పెద్ద యుద్ధమే చేస్తున్నాడు.
తాజాగా కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం.. బీజేపీ ఈ నాలుగన్నరేళ్లలో చేసిన కుంభకోణాలన్నింటిపై విడుదల చేసి ఓ సంచలన చిత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఏ టు జడ్ అక్షరాలకు సరిపోయేలా బీజేపీ చేసిన కుంభకోణాలు.. బాధ్యులైన వారి ఫొటోలను పెట్టి చాలా సృజనాత్మకంగా బీజేపీ స్కాంలను బయటపెట్టారు. భ్రష్టాచారి జనతా పార్టీ అని బీజేపీని వర్ణిస్తూ హెడ్డింగ్ కూడా పెట్టారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఏ లెటర్ వద్ద ఏ ఫర్ అదానీ స్కాం అని మొదలుపెట్టారు. జడ్ కింద జుబిన్ ఇరానీ ల్యాండ్ స్కాం అంటూ సృతీ ఈరానీ భూమి కబ్జా ఆరోపణల ఫొటోను పెట్టారు. ఇలా మోడీ సర్కారు హయాంలో మొత్తం ఏటు జడ్ 26 స్కాంలు జరిగాయంటూ కాంగ్రెస్ విడుదల చేసిన కుంభకోణాల లిస్ట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.