Begin typing your search above and press return to search.
నేనే పెద్ద తోపు...కాంగ్రెస్ అంటే కోమటి రెడ్డి ఒక్కడేనా .?
By: Tupaki Desk | 13 Aug 2022 3:40 AM GMTనేనే పెద్ద తోపును కాంగ్రెస్ కి అసలు సిసలు కాపును అంటున్నారు నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట రెడ్డి. ఆయనది ముప్పయి నాలుగేళ్ల సర్వీస్ ట. కాంగ్రెస్ లో ఆయనే బిగ్ లీడరట. మునుగోడులో నేను ప్రచారం చేస్తేనే కాంగ్రెస్ కి ఓట్లు వస్తాయి. ఆ పార్టీ గెలుస్తుంది అని ఆయన చెబుతున్నారు. నిజానికి కాంగ్రెస్ ఒక మహా సంస్థ. ఆ పార్టీలో అందరూ ఉంటేనే గెలుపు అయినా ఏదైనా సాధ్యపడేది.
కోమటి రెడ్డి బ్రదర్స్ కి ఈ రోజు బ్రాండ్ ఇమేజ్ వచ్చింది అంటే అది కాంగ్రెస్ వల్లనే అన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా సబబే. పార్టీ ఉంటేనే ఎవరైనా. పార్టీ పవరే ఎవరికైనా బలం. ఆ విషయం గతంలో ఎన్నో సార్లు రుజువు అయింది. మళ్లీ రుజువు కానుంది. అయితే పార్టీ కంటే నేను గొప్ప అని ఎవరు భావించినా చేదు ఫలితాలు వస్తాయనే అంతా అనే మాట.
ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక దగ్గరలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఎన్నికలను తెచ్చారు. ఈ నేపధ్యంలో కోమటి రెడ్డి ఇలాకాలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అత్యవసరం. ఆ దిశగా అంతా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.
అయితే కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాత్రం తేడాగా మాట్లాడుతున్నారు. తాను ప్రచారం చేస్తేనే గెలుపు అని అంటున్నారు. తాను వస్తేనే మునుగోడు లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని అంటున్నారు. తాను కాకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేస్తే మూడు వందల ఓట్లు కూడా రావని ఎకసెక్కమాడుతున్నారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి కింద పనిచేయడమా అని హూంకరిస్తున్నారు. ఇక్కడే ఆయన పార్టీ వేరు తాను వేరు అనుకుంటున్నారు.
రేవంత్ అయినా మరొకరు అయినా కాంగ్రెస్ అధినాయకత్వం నియమించిన వారే. మరి పార్టీ మీద భక్తి ఉన్నా అధినాయకత్వం మీద గౌరవం ఉన్నా పీసీసీ చీఫ్ రేవంత్ అయినా ఎవరైనా కూడా పనిచేయాల్సిందే కదా. కానీ పార్టీ కంటే తాను ఎక్కువ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటున్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న. అందుకే ఆయన ఈ విధంగా రేవంత్ రెడ్డిని రెచ్చగొడుతున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక పార్టీలో కీలక నేత అద్దంకి దయాకర్ ని సస్పెండ్ చేస్తే తప్ప తాను ప్రచారానికి రాను అని రేవంత్ రెడ్డి అంటున్నారు.
ఇలా షరతులు ఒక వైపు పెడుతూ మరో వైపు పీసీసీ చీఫ్ ని వెటకరిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న రాజకీయం పూర్తిగా వ్యక్తిగతానికే దారితీస్తోంది అంటున్నారు. పార్టీని మించి ఎవరు నేతలు అని చెప్పుకున్నా అది తప్పే. అంతకంటే ఆత్మ ద్రోహం కూడా ఉండదు. కానీ అది తెలిసేసరికి సీన్ కాలుతుంది.
మరి కోమటిరెడ్డి విషయంలో ఆయన దూకుడు ఏ ప్రస్థానానికో అన్న చర్చ అయితే వస్తోంది. ఏది ఏమైనా ఎవరైనా ఒక్కటే గుర్తు పెట్టుకోవాల్సి ఉటుంది. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదు. అది కోమటిరెడ్డి అయినా మరొకరు అయినా. పార్టీయే ఎపుడూ పెద్ద తోపు. ఇలా కనుక చూస్తే మునుగోడు ఉప పోరు చాలా ప్రశ్నలకు చాలా మందికి తగిన జవాబు చెబుతుందనే అంతా అంటున్నారు.