Begin typing your search above and press return to search.
వరంగల్ కోసం అద్భుత వ్యూహం
By: Tupaki Desk | 12 Nov 2015 7:11 AM GMTవరంగల్ ఉప ఎన్నికల ప్రచారం తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని హీటెక్కిస్తోంది. అధికార టీఆర్ ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు తమదేనని...మెజార్టీపైనే తమ గురి ఉందని ఢంకా బజాయించీ మరీ చెప్తున్న నేపథ్యంలో మిగతా పార్టీలు జాగ్రత్తపడుతున్నాయి. తెలగాణ ఇచ్చిన పార్టీగా మైలేజీ పొందేందుకు ప్రయతిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇపుడు తన సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో పార్టీ ప్రచారంలో కొత్త లుక్ ను తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది.
ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలను రంగంలోకి దించనుంది. ఈమేరకు వరంగల్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 15న భూపాలపల్లి - పరకాలలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్‌సింగ్ - లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ప్రచారం చేయనున్నారు. 16న వర్థన్నపేటలో మాజీ హోంమంత్రి, మాజీ గవర్నర్ సుశీల్ కుమార్ షిండే - 17న స్టేషన్ ఘన్ పూర్ లో సచిన్ ఫైలట్ లు ప్రచారం చేయనున్నారు. మొత్తంగా లక్ష మెజార్టీపై దృష్టి పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ ఆ లక్ష్య సాధన కోసం భారీ స్థాయిలోనే చెమటోడుస్తుంది.