Begin typing your search above and press return to search.
సోనియాగాంధీకి సీనియర్ల షాక్.. 23 మంది కలిసి ఘాటులేఖ
By: Tupaki Desk | 23 Aug 2020 6:50 AM GMTఅధికారంలో ఉన్నప్పుడు మాట్లాడటం తర్వాత.. కన్నెత్తి చూడటానికి సైతం సాహసించని వారు.. పవర్ లేని వేళ.. ఎలా వ్యవహరిస్తారో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీకి తెలీని విషయం కాదు. జీవితంలో అటుపోట్లను ఎదుర్కొన్న ఆమె.. తాజాగా మరో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గడిచిన కొద్దిరోజులుగా కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతకు సంబంధించిన చర్చ పార్టీలో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. రేపు (సోమవారం) జరిగే పార్టీ అత్యున్నత సమావేశం (సీడబ్ల్యూసీ)లో నాయకత్వ మార్పుపై కీలక చర్చ జరగనుంది. దీనికి ముందుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు ఇరవై మూడు మంది అధినేత్రికి ఘాటు లేఖ రాయటం హాట్ టాపిక్ గా మారింది. నాయకత్వాన్ని మార్చటంతో పాటు.. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేయటం గమనార్హం. పార్టీకి పూర్తికాలపు అధ్యక్షుడితో పాటు.. దూర దృష్టి, క్రియాశీలకంగా వ్యవహరించే వారిని అధ్యక్షుడిగా ఉండాలని పేర్కొనటం గమనార్హం.
సోనియమ్మకు ఘాటు లేఖ రాసిన సీనియర్ నేతల్లో కపిల్ సిబాల్.. భూపేందర్ సింగ్ హుడా.. శశిథరూర్.. పృథ్విరాజ్ చవాన్.. మిలిందర్ దేవరా.. జితిన్ ప్రసాద్ తదితరులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ లేఖ గతంలోనే రాసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. వీటిని ఇప్పటివరకు సీనియర్లు ఖండిస్తూ వచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ పగ్గాల్ని రాహుల్ గాంధీ చేపడతారా? అనూహ్యంగా ప్రియాంక పేరును తెర మీదకు తీసుకొస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. ఏమైనా.. కీలక భేటీకి కాస్త ముందు.. ఘాటు లేఖ అంశం బయటకు రావటం ద్వారా.. సీనియర్లు తమ సత్తా చాటాలని భావిస్తున్నారా? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.