Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ పార్టీ నుంచి శశిధర్ రెడ్డి బహిష్కరణ.. క్యాన్సర్ పార్టీ అదన్న మర్రి
By: Tupaki Desk | 19 Nov 2022 12:30 PM GMTతెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కు మరో కుదుపు ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత , మాజీ సీఎం కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మునుగోడులో ఓటమి తర్వాత మరింతగా నైరాశ్యంలో మునిగిపోయిన కాంగ్రెస్ సీనియర్లు పార్టీ వీడుతున్నారు. మాజీ సీఎం తనయుడు, కాంగ్రెస్ సీనియర్ నేతగా మర్రి శశిధర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పాడు.
కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించిన మర్రి శశిధర్ రెడ్డి ఈ సందర్భంగా ఆ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. ‘కాంగ్రెస్ క్యాన్సర్ తో బాధపడుతోందని.. ఇప్పట్లో ఆ వ్యాధి తగ్గే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వీడాల్సి వస్తోందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ఘాటు విమర్శలు చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఏకంగా జాతీయ ప్రకృతి విపత్తలు నివారణ సంస్థ చైర్మన్ గా శశిధర్ రెడ్డి ఉండేవారు. అలాంటి ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయ్యాక అస్సలు జీర్ణించుకోవడం లేదు. ఇంత మంది కాంగ్రెస్ సీనయిర్లు ఉండగా టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ కు ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. తాను కాంగ్రెస్ ను వీడడానికి రేవంత్ రెడ్డినే కారణమన్నారు. తానే కాదు.. కాంగ్రెస్ నుంచి ఎవరు బయటకు వెళ్లినా అందుకు రేవంత్ రెడ్డినే బాధ్యుడన్నారు.
-కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ
మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. కాంగ్రెస్ కు క్యాన్సర్ సోకిందని ఆయన వ్యాఖ్యానించడంతో పాటు నిన్న అమిత్ షాతో భేటి కావడంతో పార్టీ వ్యతిరేక చర్యల్లో భాగంగా క్రమశిక్షణ కమిటీ ఆరేళ్ల పాటు మర్రిని సస్పెండ్ చేసింది.
ఇక తాను బీజేపీలో చేరబోతున్నట్టు మర్రి ప్రకటించారు. చివరగా తానే కాదు.. తనతోపాటు మరికొందరు కూడా కాంగ్రెస్ ను వీడుతున్నట్టు ప్రకటించాడు మర్రి శశిధర్ రెడ్డి. అందరూ కలిసి అమిత్ షా లేదా.. జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.