Begin typing your search above and press return to search.
కేటీఆర్ డైలాగ్ టీఆర్ ఎస్ కు మైనస్ అయ్యిందా...?
By: Tupaki Desk | 10 Oct 2019 6:17 AM GMTహుజూర్ నగర్ ఉప ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడం - పార్టీల మద్దతు తేలిపోవడం - ఎంత మంది అభ్యర్థులు రంగంలో ఉంటారో ఖరారు కావడంతో ఇక క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. రాష్ట్ర వ్యాప్త దృష్టిని ఆకర్షించడంతో పాటు అధికార టీఆర్ ఎస్ - ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మధ్య ప్రతిష్టాత్మకంగా మారిన ఉప పోరులో రెండు పార్టీలు గెలుపు కోసం శాయశక్తులా పోరాడుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన స్థానం కావడం.. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉండడంతో పాటు ఆయన భార్యే ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండడంతో ఈ ఉప ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇక ఉత్తమ్ కుంచుకోటను బద్దలు కొట్టేందుకు ఇదే మంచి ఛాన్స్ అని భావిస్తోన్న టీఆర్ ఎస్ ఇక్కడ గత ఎన్నికల్లో ఓడిన సైదిరెడ్డినే పోటీ చేయించి సానుభూతి పొందే ప్రయత్నాల్లో ఉంది. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా హుజూర్ నగర్ లో రోడ్ షోకు వెళ్లిన టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ - రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన ఓ వ్యాఖ్య నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. జీ హు జూరా? జై హుజూర్ నగరా? అంటూ ఆయన చేసిన ఈ కామెంట్ ను టీఆర్ ఎస్ తో పాటు అన్ని పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుంటూ ప్రచారం చేసుకుంటున్నాయి.
నియోజకవర్గ ప్రజలు ఉత్తమ్ కు జీ హుజూర్ అనకుండా హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి జై కొట్టాలనే అర్థంతో చేసిన కేటీఆర్ వ్యాఖ్యను క్షేత్రస్థాయి ప్రచారంలో టీఆర్ ఎస్ నేతలు బాగానే వాడుకుంటున్నారు. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈ వ్యాఖ్యను అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని - ఆయన్ను కలిసేందుకు మంత్రులు - ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేదని - అలాంటి వ్యక్తి నియోజకవర్గం పైకి వందలాది మంది నేతలను పంపి దండయాత్ర చేయిస్తున్నారని కేటీఆర్ డైలాగ్ కు కౌంటర్ ఇస్తోంది.
ఈ నేపథ్యంలో కేసీఆర్ దొరపాలనకు జీ హుజూర్ అనకుండా నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి జై హుజూర్ నగర్ అనాలని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇతర పార్టీ - స్వతంత్ర అభ్యర్థుల ప్రచారంలో కూడా ఈ వ్యాఖ్యలు చర్చకు వస్తుండటం గమనార్హం. దీంతో ఇప్పుడు కేటీఆర్ ఏ డైలాగ్ అయితే వేశారో అదే డైలాగ్ ను కాంగ్రెస్ తో పాటు అన్ని పక్షాలు తమ ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నాయి.