Begin typing your search above and press return to search.
వందేళ్ల చరిత్ర... అయినా పరాన్న జీవే
By: Tupaki Desk | 23 Aug 2018 1:30 AM GMTవందేళ్ల చరిత్ర ... ఒంటరిగా దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన పార్టీ. ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేసి ప్రపంచ వ్యాప్తంగా దేశానికి దిశానిర్దేశం చేసిన పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడా ఘనతంతా చరిత్ర గతిలో కలిసిపోతోంది. ఇంతకీ ఘనత వహించిన ఆ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షాలతో కలిసి అధికారంలోకి రావాలని కలలు కంటోంది. అంత చరిత్ర ఉన్న పార్టీకి ఇది అవమానమే అయినా ప్రస్తుత పరిస్థితులలో మాత్రం అనివార్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే ప్రతిపక్షాలను మచ్చిక చేసుకోవాల్సిన పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని గద్దెదించాలంటే సంకీర్ణ రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం లో భాగస్వామి అయ్యింది. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలతో కలసి వచ్చే ఎన్నికలలో అధికారాన్ని "హస్త" గతం చేసుకోవాలనుకుంటోంది. తెలంగాణలో పొత్తులు పెట్టుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ - తెలుగుదేశంతో కలసి పోటీ చేసే అవకాశం ఉంది. ఇక తమిళనాడు - పశ్చిమ బెంగాల్ - యూపీతో సహా పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు పొందిన సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ ను పార్టీ కోశాధికారిగా నియమించారు. ఆయనకు సంకీర్ణ రాజకీయాలను నడపడంలో దిట్ట అని పేరుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అహ్మద్ పటేల్ కీలక పదవి చేపట్టారు. ఇది కాంగ్రెస్ పార్టీ ముందు ముందు చేయబోయే సంకీర్ణ రాజకీయాలకు తొలి అడుగు. దేశంలోని పలువురు సీనియర్ నాయకులతో అహ్మద్ పటేల్ కు స్నేహసంబంధాలున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. అన్ని వైపులనుంచి ఏ ఒక్క అవకాశాన్ని వదలుకోకుండా పావులు కదపాలన్నది కాంగ్రెస్ వ్యూహం. ఇందులో భాగంగానే ఆ తరం నేతలను ప్రత్యక్ష రాజకీయలలోకి తీసుకొచ్చే పనిలో పడ్డారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ పాత వ్యవహార శైలికి భిన్నంగా రాహుల్ గాంధీ కొత్త రాజకీయాలు చేస్తున్నారు. ఇంతకు ముందు బద్ద శత్రువులుగా భావించిన మమతా బెనర్జీ - చంద్రబాబు నాయుడను దగ్గరకు తెచ్చుకోవడం ఇందులో భాగమే.