Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ నేచులర్ ట్రిక్స్ వర్కవుట్ అవుతాయా?
By: Tupaki Desk | 10 Nov 2018 5:30 PM GMTఐదు పదేళ్ల క్రితం వరకు కాంగ్రెస్ మూడింటిని నమ్ముకునేది. ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత. రెండు..ఇందిరాగాంధీ - మూడు..ముస్లింలు, -ఎస్సీలు. అయితే - రాజకీయం కూడా మారింది. టెక్నాలజీ మారింది. ట్రెండ్స్ వచ్చాయి. దీంతో కాంగ్రెస్ కూడా తన రూటు మార్చుకోక తప్పలేదు. ఇపుడు సోషల్ మీడియా అనే అస్త్రం ఒకటుంది. అబద్ధమా; నిజమా? అనే దాంతో సంబంధం లేకుండా గుడ్డిగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వర్గం ఒకటొచ్చింది ఇపుడు.
తన చరిత్రను సమీక్షించుకన్న కాంగ్రెస్ విధానాలను మార్చుకుంది. మార్చుకోకపోవడం వల్ల 2014లో ఊహించనంతగా దెబ్బతింది. ఇపుడు మేలుకొంది. అయితే, ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిపక్షాలకు ఎపుడూ ప్లస్లే కానీ దానిని వాడుకోవడం కూడా రావాలి. దేశం సంగతి పక్కన పెడితే తెలంగాణలో ముస్లింలు ఇపుడు కాంగ్రెస్ వైపు లేరు. వారంతా టీఆర్ ఎస్ వైపు ఉన్నారు. ఒవైసీలు కూడా టీఆర్ ఎస్ కు మద్దతు ఇస్తున్నారు. ఇక ఇందిరాగాంధీ ప్రభావం కొత్త జనరేషన్లో లేదు. అందుకే కాంగ్రెస్ కూడా ట్రిక్స్ ప్లే చేస్తోంది. సోషల్ మీడియాను వాడుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తోంది. దీనికి ఈ మధ్య బాబు సాయం కూడా తీసుకుంటోంది. తాజాగా బస్సులో ఓ ముగ్గురు వ్యక్తులు రాష్ట్రంలో కేసీఆర్ కు భారీగా వ్యతిరేకత ఉందని మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల రాజకీయాలపై ఓ ముగ్గురు తెలంగాణ పౌరులు మాట్లాడుకుంటంటారు ఆ ఆడియోలో. అయితే, ఇది కాంగ్రెస్ క్రియేట్ చేసిన వీడియో అని ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. అది కావాలని చేశారని... లేకపోతే కరీంనగర్ లో టీఆర్ ఎస్ కు ఒక్క సీటు రాకపోవడం ఏంటి? మరీ ఫూలిష్ గా ఉంది ఐడియా అని తిడుతున్నారు జనం. పైగా ఆ వీడియోలో ఆర్టీసీ ఎంప్లాయీస్ - వారి ఓట్లు - ఉత్తమ్ హామీలు వంటి మాటలు బట్టి ఇది క్రియేటెడ్ వీడియో అని అర్థమైపోతోంది. ఇలాంటి చీప్ ట్రిక్స్ వల్ల జనం దగ్గరవకపోగా మరింత దూరమయ్యే ప్రమాదం ఉంది.
నిజానికి గత కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే కేసీఆర్ పథకాలు - అభివృద్ధి పనులు ఎక్కువ జనాదరణ పొందాయి. నీటి పారుదల రంగంలో కేసీఆర్ చాలా పేరు పొందారు. అందుకే మళ్లీ కాంగ్రెస్ పాలన అందిస్తాం అని చెప్పలేకపోతున్నారు. వీళ్ల హామీలు కూడా రాష్ట్ర బడ్జెట్ కు మించి ఇవ్వడంతో జనం నమ్మడానికి జంకుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ను ప్లే చేస్తూ కేసీఆర్ మీద వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తోంది.
మరోవైపు హరీష్ - కేటీఆర్ ఇప్పటికే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఓ రౌండ్ ప్రచారం కంప్లీట్ చేశారు. కేసీఆర్ పనులు - పథకాలు... కేటీఆర్ - హరీష్ ల వాగ్దాటి టీఆర్ ఎస్ కు బలం. అందుకే ప్రజల్లో కేసీఆర్ వేవ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన అన్ని సర్వేల్లో టీఆర్ ఎస్ గెలుస్తుందని తేలింది. ఇది కూడా కాంగ్రెస్ లో కలవరానికి ఓ కారణం. అందుకే జనంలో టీఆర్ ఎస్ లేదు అని ఇప్పుడు నిరూపించకపోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఈ వీడియో కృత్రిమంగా క్రియేట్ చేసిందా అని అనుమానిస్తున్నారు.