Begin typing your search above and press return to search.
కన్నయ్య ఉత్సాహం.. కాంగ్రెస్ అత్యుత్సాహం
By: Tupaki Desk | 23 March 2016 11:30 AM GMTజవహర్ లాల్ నెహ్రూ వర్శిటీ విద్యార్థి కన్నయ్య కుమార్ కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దేవుడు పంపించిన దూతలా కనిపిస్తున్నాడు. రాజద్రోహ నేరంపై అరెస్ట్ అనంతరం బెయిల్‌పై విడుదలైన కన్నయ్య ఈ నెల 3న జవహర్ లాల్ నెహ్రూ వర్శిటీ ఆవరణలో భారీ విద్యార్ధి సమూహాలను ఉద్దేశించి చేసిన ప్రసంగం విద్యార్ధుల్లో ఏ మేరకు ఉత్సాహం నింపిందో తెలియదు కానీ కాంగ్రెస్ లో మాత్రం ఆ సంఘటన అత్యుత్సాహాన్ని నింపినట్లుగా ఉంది. ఆయన ప్రసంగం పూర్తయిన వెంటనే కాంగ్రెస్ కు చెందిన కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ కన్నయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ దేశంలో కొత్తతరం నాయకుడు ఉద్భవించాడంటూ ఆకాశానికెత్తేశారు. అన్నింటికి మించి ప్రధాని మోడీకి కొత్త శత్రువు ఆవిర్భవించాడంటూ ఆయన చేసిన వ్యాఖ్య కాస్త అతే అనిపించింది.
రెండ్రోజుల క్రితం థరూర్ మళ్లీ కన్నయ్యను ఆకాశానికెత్తేశారు. ఆయన్ను భగత్ సింగ్ తో పోల్చుతూ కన్నయ్యనే కన్ఫ్యూజన్ లో పడేశారు. అయితే... ఇదంతా కాంగ్రెస్ నాయకత్వలేమికి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి - నెహ్రు-గాంధీ కుటుంబానికి బద్ధులైన జాతీయ నాయకులకు సైతం తమ యువరాజు రాహుల్ గాంధీపై పూర్తి నమ్మకం లేదని... అయితే, ఆ విషయం వ్యక్తపరిస్తే ఏమవుతుందో తెలుసు కాబట్టి ఏమీ అనలేక కామ్ గా ఉంటున్నారని.. ఇప్పుడు కన్నయ్యతోనైనా కొత్త నాయకత్వం వస్తే మంచిదన్న భావనలో ఉన్నారని అంటున్నారు. రాహుల్ కు చేదోడువాదోడుగా కన్నయ్యను చూపుతూ ఎన్డీయే వ్యతిరేక పోరు మొదలుపెట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మంగళవారం కన్నయకుమార్ రాహుల్ గాంధీని కలిశారు. కన్నయ్య అరెస్టు నేపథ్యంలో జేఎన్ యూలో ఏర్పడ్డ ఉద్రిక్త వాతావరణం నడుమ రాహుల్ కన్నయ్యకు తన మద్దతు ప్రకటించారు. ఇందుకుగాను కన్నయ్య కుమార్ రాహుల్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ పరిణామాలు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ దయనీయ స్థితికి ఇవి అద్దం పడుతున్నాయన్న వాదన వినిపిస్తోంది.
1885లో ఆవిర్భవించిన కాంగ్రెస్ ఆరు దశాబ్ధాలకుపైగా స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించింది. కాంగ్రెస్ పేరిట ఎందరో నేతలు స్వతంత్రం కోసం ఆత్మత్యాగాలు చేశారు. అప్పటికే కమ్యూనిస్టులు - మరికొందరు కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నా వారందరికంటే విభిన్నశైలిలో కాంగ్రెస్ ఈ పోరాటం నిర్వహించింది. స్వతంత్ర ఫలితాన్ని మొత్తంగా తన ఖాతాలో వేసుకుంది. స్వతంత్రానంతరం కూడా అందుకు ప్రతిఫలాల్ని అనుభవిస్తూనే ఉంది.
దీర్ఘకాలం పాటు ఈదేశాన్నేలింది. వంశపారంపర్య పాలనను సాగించింది. గత ఎన్నికల్లో మాత్రం దేశంలో, పలు రాష్ట్రాల్లో పరాజయాన్ని మూటగట్టుకుని ఎన్నడూ లేనంత ఇబ్బందుల్లో పడింది. అలాంటి పార్టీ ఇప్పుడు కన్నయ్య కుమార్ ను దువ్వుతోంది. తమ పార్టీకి ఆపద్బాంధవుడిలా భావిస్తోంది.
నిజానికి కన్నయ్య కుటుంబానికి కమ్యూనిస్ట్ నేపథ్యముంది. డిగ్రీలోనే ఆయన కమ్యూనిస్ట్ అనుబంధ విద్యాసంఘం ఎఎస్ ఎఫ్ లో చేరారు. ఆ సంఘం తరపునే జెఎన్ యు విద్యార్ధి సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందారు. ఇంతవరకు జరిగిన సాధారణ ఎన్నికల్ని పరికిస్తే కాంగ్రెస్ అవసరానికనుగుణంగా వామపక్షాలతో మైత్రి ప్రదర్శిస్తోంది. 2004లో కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీకి దిగింది. అదే కాంగ్రెస్ 2009లో వామపక్షాల్ని పక్కనపెట్టింది. 2014లోనూ ఆ పార్టీ వామప క్షాల్ని తోసిపారేసింది. స్థానికంగా బలమున్న పార్టీల్తో జతకట్టడం కాంగ్రెస్ కు ఆనవాయితీగా వస్తోంది.
ప్రస్తుతం కీలకమైన పశ్చిమబెంగాల్ - కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల ప్రధాన పక్షాలేవీ కాంగ్రెస్ తో కలిసేందుకు ముందుకు రావడం లేదు. అలాగే పశ్చిమబెంగాల్ లో మమత కలసి రాకపోవడంతో వామపక్షాల్తోనే సరిపెట్టుకుంది. పశ్చిమబెంగాల్ లో తృణమూల్ - బిజెపిలను - అలాగే కేరళలో బిజెపి - ఎల్ డీఎఫ్ లనూ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు వెన్నుదన్నుగల కన్నయ్య కుమార్ ను భుజానికెత్తుకుని ఎన్నోకొన్ని ఓట్లు సాధించుకోవచ్చన్న కాంగ్రెస్ ఎత్తుగడ తాజా ప్రకటనలతో బయటపడుతోంది.
దీర్ఘకాలం ఈ దేశాన్నేలి వేలాదిమంది నాయకుల్ని తయారు చేయగలిగిన కాంగ్రెస్ తనంతతానుగా మోడికి వ్యతిరేకంగా బలమైన నాయకుడ్ని తయారుచేయలేక విద్యార్ధి ఉద్యమం నుంచి పైకొచ్చిన కన్యయ్యను మోడీకి ప్రత్యర్ధిగా పరిగణించడం ఆ పార్టీ నాయకత్వ వైఫల్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే... భరతమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు విదేశీ పాలకులపై తిరుగుబాటు చేసి నవ్వుతూ ఉరికంబమెక్కిన... లక్షలాదిమంది యువతలో దేశభక్తిని నింపిన భగత్ సింగ్ తో దేశద్రోహ ఆరోపణలెదుర్కొంటున్న కన్నయ్యను పోల్చడం విమర్శలకు తావిస్తోంది. అతనిపై ఆరోపణల్లో నిజానిజాలు పక్కనపెడితే ఆయన అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేశారన్న అభియోగాల్ని ఎదుర్కొంటుండడం మాత్రం నిజం. ఈ అంశం న్యాయప్రక్రియలో ఉండగానే కాంగ్రెస్ నేతలు కన్నయ్యకు క్లీన్ చిట్ ఇచ్చేసి చంకనెత్తుకుంటున్నారు. వామపక్ష ఓటు బ్యాంక్ ను తమవైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. వామపక్షాలు బలంగా ఉన్న కేరళ - పశ్చిమబెంగాల్ లలో ప్రచారానికి కన్నయ్యను వినియోగించుకునే ఏర్పాట్లు కూడా చకచకా పూర్తిచేశారు. కాంగ్రెస్ - బిజెపి రెండూ పరస్పర వైరుద్య భావజాలంతో ఏర్పాటైన పార్టీలు.
ఇంతకాలం సైద్ధాంతిక పోరుకు భిన్నంగా వ్యక్తిపూజకే అధిక ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్ లో ఛరిష్మాగల ద్వితీయశ్రేణి నాయకత్వం ఏర్పడలేదు. దీంతో ఇప్పుడు చిన్న చిన్న ఉద్యమాలు - విశ్వవిద్యాలయ వివాదాల్లో తలదూర్చి వారి ప్రాపకంతో ఓట్లు పొందాలన్న అగత్యానికి గురికావడం ఆపార్టీ సైద్దాంతిక భ్రష్టత్వానికి అద్దంపడుతోంది. ఓట్ల కోసం కన్నయ్య ఏకంగా భగత్ సింగ్ తో సరిపోల్చడం, ఇద్దరూ ఒకే తరహా దేశభక్తులంటూ ప్రకటనలివ్వడం భగత్ సింగ్ ను అవమానపర్చినట్లేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ లో నాయకత్వ లేమే ఆ పార్టీని ఇంతకు దిగజారేలా చేసిందన్న వాదన బలంగా వినిపిస్తోంది.