Begin typing your search above and press return to search.

క‌న్న‌డ‌ ఎన్నిక గెలిస్తే... కాంగ్రెస్ పుంజుకున్న‌ట్టే జాతీయ స్థాయి అంచ‌నాలు

By:  Tupaki Desk   |   23 April 2023 7:00 PM GMT
క‌న్న‌డ‌ ఎన్నిక గెలిస్తే... కాంగ్రెస్ పుంజుకున్న‌ట్టే జాతీయ స్థాయి అంచ‌నాలు
X
దేశ‌వ్యాప్తంగా జారుడు బండ‌ పై విన్యాసాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ఊప‌రి పోయ‌నున్నాయా? ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇమేజ్‌.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌నకు జ‌రిగిన ప‌రాభ‌వం(పార్ల‌మెంటు స‌భ్య‌త్వం ర‌ద్దు), వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ ఓట‌మి చెందిన‌తీరు వంటివి.. కూడా ఈ ఎన్నిక‌ల‌తో కొట్టుకుపో యే అవ‌కాశం ఉందా? అంటే.. జాతీయ స్థాయిలో జ‌రుగుతున్న చ‌ర్చ‌లు ఔన‌నే అంటున్నాయి.

ప్ర‌స్తుతం పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ వేళ్లూనుకుంది. ఒక్క రాజ‌స్థాన్‌లో త‌ప్ప‌.. కాంగ్రెస్ ఎక్క‌డా పెద్ద రాష్ట్రాల్లో అధికారంలో లేదు. దీనికితోడు.. గెలుస్తామ‌ని అనుకున్న రాష్ట్రాలు కూడా.. ఇటీవ‌ల కాలంలో కోల్పోయింది.ఈ ప‌రిణామాల‌తో కాంగ్రెస్ ప‌రిస్థితి తిరోగ‌మ‌నంలో సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ప‌రిస్తితి నుంచి అంతో ఇంతో కోలుకుని త‌న ఉనికిని కాపాడుకునేందుకు ఉన్న ఏకైక మార్గం.. క‌ర్ణాట‌కే న‌ని అంటున్నారు పరిశీల‌కులు.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో వ‌స్తున్న ముందస్తు ఎన్నిక‌ల ఫ‌లితాలు కూడా కాంగ్రెస్‌కు సానుకూలంగానే ఉన్నా యి. ఏ రిపోర్టు చూసినా కాంగ్రెస్‌కు అనుకూలంగానే ఉంది. అంతేకాదు.. కాంగ్రెస్ సంపూర్ణ మెజారిటీ కూడా ద‌క్కించుకుంటుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

ఇదే జ‌రిగితే.. 40 ఏళ్ల క‌ర్ణాట‌క చ‌రిత్ర‌లో కాంగ్రెస్ రికార్డును సృష్టించిన‌ట్టే అవుతుంది. నాలుగు ద‌శాబ్దాలుగా.. ఇక్క‌డ ఏ పార్టీకీ కూడా.. ప్ర‌జ‌లు సంపూర్ణ మెజారిటీ క‌ట్ట‌బెట్ట‌డం లేదు.

తాజాగా కాంగ్రెస్‌కు సానుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని చెబుతుండ‌డం.. ముంద‌స్తు ఎన్నిక‌ల స‌ర్వేలు కూడా కాంగ్రెస్ ప‌రిస్థితి మెరుగు ప‌డుతుంద‌ని చెబుతుండ‌డం వంటివి ఆ పార్టీలో కొంత జోష్ నింపు తున్నాయి. రోజు రోజుకు కాంగ్రెస్‌లో చేరేవారు కూడా పెరుగుతున్నారు. ఈ స‌ర్వేలు చెప్పిన‌ట్టుగా కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే.. ఆ పార్టీ జాతీయ స్థాయిలో పుంజుకునేందుకు మార్గం సుగ‌మం అయిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.