Begin typing your search above and press return to search.
సీఎంకు విషం ఇవ్వలేదు..అమృతం ఇచ్చాం
By: Tupaki Desk | 16 July 2018 6:44 AM GMTఅధికారం వచ్చే వరకూ ఉండే అతృత.. ఆ తర్వాత అసలు కష్టాలు షురూ కావటం.. భావోద్వేగానికి గురి కావటం మామూలే. తాజాగా అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. కేవలం37 సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పటికీ.. అంకెల మాయాజాలంతో అనూహ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్న పొత్తుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి సీఎం అయ్యారు. అయితే.. సంకీర్ణ ప్రభుత్వంలో ఎదురవుతున్న ఒత్తిళ్లు.. ఇబ్బందుల దృష్ట్యా.. తాను సీఎంగా సంతోషంగా లేనని.. విషయం తాగుతూ నొప్పిని తనలోనే భరిస్తున్నట్లుగా చెప్పిన కుమారస్వామి భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టారు.
కుమారస్వామి కన్నీళ్లు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యల్లోకి దిగారు కర్ణాటక కాంగ్రెస్ నేతలు. సీఎం కుమారస్వామికి తాము అమృతాన్ని ఇచ్చినట్లుగా వారు చెప్పటం గమనార్హం . ఎన్నికల్లో జేడీఎస్ 37 సీట్లు గెలుచుకున్నా.. సీఎం పదవిని కుమారస్వామికి ఇచ్చి అమృతాన్ని ఇచ్చినట్లుగా వారు వ్యాఖ్యానిస్తున్నారు.
సంకీర్ణ ప్రభుత్వాన్నినడపటంలో ఇబ్బంది సహజమేనని.. కానీ సీఎం కుమారస్వామి వాటిని అధిగమించి మంచి పాలనను అందిస్తారన్న నమ్మకం తమకు ఉన్నట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు వ్యాఖ్యానించారు. భావోద్వేగంతో కుమారస్వామి కంటతడికి కౌంటర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు ఆయనకు ఊరడింపుగా మారతాయో లేదో చూడాలి.