Begin typing your search above and press return to search.

షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ : మోడీని మాజీని చేసేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్...?

By:  Tupaki Desk   |   16 July 2022 10:00 AM GMT
షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ : మోడీని మాజీని చేసేందుకు కాంగ్రెస్  పక్కా ప్లాన్...?
X
ఇప్పటికి రెండు దశాబ్దాల క్రితం గుజరాత్ లో జరిగిన అల్లర్లు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఈ అల్లర్ల వెనక మోడీ ఉన్నారని ఆయన సర్కార్ మీద ఎన్నో విమర్శలు చెలరేగాయి. ఒక దశలో మోడీ సీఎం పదవి కూడా పోయే ప్రమాదం వచ్చింది. నాడు దేశానికి ప్రధానిగా ఉన్న వాజ్ పేయ్ మోడీని గద్దె దిగమని శాసించారు కూడా. ఇక దేశమంతా నాడు మోడీకి యాంటీగా అట్టుడికింది. అయితే దీని మీద షాకింగ్ నిజాలు అయితే ఇపుడు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి.

అవేంటి అంటే గుజరాత్ అల్లర్ల వెనక పెద్ద కధే నడించిందని. ఈ అల్లర్ల వెనక అసలు ప్లాన్ రాజకీయంగా ఉందని. దాన్ని డిజైన్ చేసింది నాటి కాంగ్రెస్ పెద్ద, గుజరాత్ కి చెందిన దివంగత అహ్మద్ పటేల్ అని అంటున్నారు. ఈ మేరకు పోలీస్ శాఖకు చెందిన సిట్ 2002 గుజరాత్ అల్లర్ల కేసును దర్యాప్తు జరుపుతోంది.

దీంట్లో ఎన్నో షాకింగ్ విషయాలు బయటకు వస్తునాయి. కేవలం తప్పుడు సాక్ష్యాలు, కల్పిత కధలతోనే మోడీ మీద నాడు ఆరోపణలు చేశారని అంటున్నారు. ఇక సామాజిక కార్య‌క‌ర్త తీస్తా సెత‌ల్వాద్‌, మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌, ఐపీఎస్ ఆఫీస‌ర్ సంజీవ్ భ‌ట్‌ల‌కు అహ్మ‌ద్ ప‌టేల్ 30 ల‌క్ష‌లు ఇచ్చార‌ని కూడా ఈ విచారణలో సిట్‌ తెలిపింది. దీని వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటి అంటే గుజరాత్ అల్ల‌ర్ల కేసులో మోదీని ఇరికించాలనే అంటున్నారు. .

ఆ విధంగా నాటి కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ ప‌టేల్ ఆ డ‌బ్బులు ఇచ్చిన‌ట్లు సిట్ త‌న నివేదికలో పేర్కొన్న‌ది. అలాగే, సెత‌ల్వాద్‌, శ్రీకుమార్‌లు నేర కుట్ర‌కు, ఫోర్జ‌రీకి పాల్ప‌డిన‌ట్లు సిట్ వెల్ల‌డించింది. ఇక ఈ కేసుకు సంబంధించి ఈ నెల రెండ‌వ తేదీన సెతల్వాద్‌, శ్రీకుమార్‌ల‌ను 14 రోజుల పాటుకు రిమాండ్‌కు త‌ర‌లిస్తూ అహ్మ‌దాబాద్ మెట్రోపాలిట‌న్ కోర్టు పోలీసులను ఆదేశించింది.

మొత్తంగా చూస్తే మోడీని నాడు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని పెద్ద ప్లాన్ తోనే ఇదంతా కాంగ్రెస్ చేసిందని సిట్ కధనం బట్టి తెలుస్తోంది. అయితే ఇదంతా అబద్ధమని, సత్యదూరమని కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేష్ అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీని మరణించిన అహ్మద్ పటేల్ ని బదనాం చేయడానికే ఇదంతా అని ఆయన విమర్శిస్తున్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలను తమ పార్టీ ఖండిస్తోందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే గుజరాత్ అల్లర్ల కేసులో సిట్ లేటెస్ట్ దర్యాప్తు మాత్రం సంచలన విషయాలనే బయటపెట్టింది అనుకోవాలి.