Begin typing your search above and press return to search.

హతవిధీ.. ఏమిటీ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక? ఎవరు విజేత?

By:  Tupaki Desk   |   17 Oct 2022 6:10 AM GMT
హతవిధీ.. ఏమిటీ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక? ఎవరు విజేత?
X
ఒకటి కాదు.. రెండు కాదు 137 ఏళ్ల పార్టీ. అంత పెద్ద పార్టీ కాబట్టే దేశాన్ని 50ఏళ్లకు పైగా పాలించింది. రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కానీ 100 ఏళ్ల పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ఏ పార్టీలో లేదు. ఎవరు ఎవరిని అయినా తిట్టొచ్చు. కాంగ్రెస్ లో ఉంటూ అసమ్మతి రాజేయవచ్చు. తమ్ముడిని బీజేపీలోకి పంపి.. అన్న కాంగ్రెస్ లోనే ఉంటూ దెబ్బతీయవచ్చు. అంతటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ ను ఎవరూ కాపాడలేకపోతున్నారు.

ఇక కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎంతంటే కనీసం కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఏకగ్రీవం చేద్దామని అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చినా ఎవరూ మాట వినని పరిస్థితి. ఏకంగా పోటీపడ్డ దుస్థితి. కాంగ్రెస్ పార్టీ మొత్తం మల్లిఖార్జున ఖర్గేను నిలబెడితే ఆయన పోటీగా అసమ్మతి రాజేసి కేరళ సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. దీంతో కాంగ్రెస్ లో ఆయనను వెలివేసిన పరిస్థితి.

వీరిద్దరిలో ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం ఖాయమే. 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇలా అసమ్మతితో ఎన్నికలు జరుగుతున్నాయి. గాంధీయేతర వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఎంపిక చేస్తోంది. సోమవారం దేశవ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాల్లో పార్టీలోని సుమారు 9వేల మంది పీసీసీ డెలిగేట్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

137 ఏళ్ల చరిత్రగల పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులను సీన్ వేసి ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి తరలించి ఈనెల 19న కౌంటింగ్ చేపట్టి అదేరోజున ఫలితాలు ప్రకటిస్తారు. సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ సోమవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేస్తే రాహుల్ భారత్ జోడో యాత్ర క్యాంపులో ఓటు వేశాడు.

సోనియా, రాహుల్, ప్రియాంక సహా గాంధీ కుటుంబంకు సంబంధం లేకుండా కొత్త వ్యక్తి 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఈ సారి విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.