Begin typing your search above and press return to search.
బాబు...ముందుంది ముసళ్ల పండగ
By: Tupaki Desk | 17 Nov 2018 4:08 AM GMT`ఎన్నికల్లో పోటీ చేయడం గురించి పట్టుబట్టకండి. గెలిచే సీట్లే అడగండి. అక్కడ గెలిచేందుకు వ్యూహం సిద్ధం చేసుకోండి`` ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. మహాకూటమి పేరుతో కాంగ్రెస్ తో దోస్తీ కట్టినప్పటి నుంచి ఆయన పార్టీ శ్రేణులకు పదే పదే వల్లెవేసిన సూచన. బాబుగారి ఆదేశం మేరకు టికెట్ త్యాగం చేసిన నాయకులు ఎందరో. మరోవైపు కూటమి ద్వారా భాగస్వామిగా ఉన్న టీడీపీకి 14 సీట్లు దక్కాయి.
అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ప్రారంభం అయిందంటున్నారు. మహాకూటమిలో కాంగ్రెస్ తో పొత్తు కారణంగా తమకు సీట్లు దక్కాయన్న ఆనందం కంటే... కాంగ్రెస్ రెబల్స్ ఎక్కడ తమకు ఇబ్బందిగా మారతారనే భయమే టీడీపీ అభ్యర్థులను ఎక్కువగా వేధిస్తోందని ఇంకా చెప్పాలంటే ఓటమి భయం వెంటాడుతోందని అంటున్నారు. మొదటి సారి బరిలో దిగుతున్న వారి నుంచి మొదలుకొని మాజీ మంత్రులు - ఎంపీలు ఇందులో ఉన్నారని చెప్తున్నారు.
చంద్రబాబు ఆప్తుడిగా పేరొందిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఖమ్మం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయనకు మద్దతు ఇచ్చే అంశంపై కాంగ్రెస్ నేతలు ఎటూ తేల్చలేదు. ఈ వ్యవహారంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది. కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న దివంగత హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినికి సైతం రెబల్స్ బెడద ఉండదనే గ్యారంటీ లేదు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు తాము ఆమెకు సహకరించేది లేదని ప్రకటనలు కూడా చేశారు. ఈ పరిణామం సుహాసిని విజయాన్ని ప్రభావితం చేసేదే. ఇక నందమూరి బాలకృష్ణ కోటాలో శేరిలింగంపల్లి నుంచి టికెట్ దక్కించుకున్న భవ్య ఆనంద్ ప్రసాద్ కు సైతం రెబెల్ బెడద ఎదురవుతోంది. టీడీపీ అభ్యర్థికి పోటీ అవకాశం ఇవ్వడంపై కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ బిక్షపతి యాదవ్ భగ్గుమన్నారు. రెబల్‌గా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
పార్టీ సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ ఉప్పల్ నుంచి బరిలో ఉండగా....ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న బండారు లక్ష్మారెడ్డి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేస్తుండగా... ఆయన కంటే ముందుగానే కాంగ్రెస్ రెబల్ నాయిని రాజేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఇబ్రహీంపట్నం నుంచి రేసులో ఉన్న సామ రంగారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఆశించిన క్యామ మల్లేశ్ - మల్ రెడ్డి రంగారెడ్డి ఎక్కడ బరిలోకి దిగుతారో అనే ఆందోళన వేధిస్తోంది. రాజేంద్రనగర్ టీడీపీ అభ్యర్థిగా గణేశ్ గుప్తా బరిలో ఉండగా... కాంగ్రెస్ రెబల్‌గా సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి రేసులో నిలిచారు. మక్తల్ లో కొత్తకోట దయాకర్ రెడ్డి - మహబూబ్ నగర్ లో ఎర్ర శేఖర్ కు కూడా ఇదే రకమైన పరిస్థితులు ఉన్నాయి.
స్థూలంగా చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులను అయితే అసమ్మతి లేదంటే...సహాయ నిరాకరణ ఈ అంశం భయపెడుతోంది. టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో రెబల్స్ గా రేసులో నిలిచేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతుండటం ఇందుకు కారణం. మరోవైపు మొత్తానికి బలమైన టీఆర్ ఎస్ ప్రత్యర్థులతో పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్న టీడీపీ అభ్యర్థులకు కాంగ్రెస్ రెబల్స్ దడ పుట్టిస్తున్నారు. మరి... నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసేలోపు వీరిలో ఎంతమంది వెనక్కి తగ్గుతారనేది చూడాలి. అదే సమయంలో...పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టి చంద్రబాబు సాధించేది ఏంటో కూడా ఆసక్తికరంగా మారింది.