Begin typing your search above and press return to search.
కర్ణాటకను కుదిపేస్తున్న 'ఉచితాలు'!
By: Tupaki Desk | 17 Jan 2023 11:30 PM GMTవర్షాకాలంలో వరదలు.. అతి భారీ వర్షాలతో రాష్ట్రాలకు కుదుపు రావడం సహజం. అయితే.. ఇప్పుడు ఎన్నికల వేళ అయితే.. చాలు.. ఆయా రాష్ట్రాల్లో ఉచితాలో జోరు పెరిగిపోతోంది. ఉచితాలు వ్యర్థం అంటూ.. బీజేపీ కొంత మేరకు వీటికి దూరంగా ఉంటున్నా.. తాము కూడా ఉచితాలకు అనుకూలం కాదనే కాంగ్రెస్ మాత్రం.. ఎక్కడ ఎన్నికలు ఉంటే.. అక్కడ ఉచితాల వర్షం కురిపిస్తోంది. ఇటీవల గుజరాత్‌లోనూ ఉచితాలు ప్రకటించినా.. అక్కడ సక్సెస్ కాలేదు.
ఇక, పెద్దగా ఉచితాల జోలికి పోని హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం దక్కించుకోగా..ఇక్కడ మాత్రం ఉచితాల వాగ్దానాలు చేసిన బీజేపీ మాత్రం చతికిల పడింది. ఇక, మరో నాలుగు మాసాల్లో కర్ణాటక ఎన్నకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇక్కడ విజయం దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో ఉచిత హామీలతో ప్రజలను తడిసి ముద్దయ్యేలా చేస్తోంది.
తాజాగా 'గృహలక్ష్మీ' అనే కొత్త పథకాన్ని కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి గృహిణికి నెలకు రూ. 2,000 చొప్పున భృతి ఇస్తామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాగ్దానం చేశారు.
దీని ద్వారా సుమారు కోటిన్నర మంది గృహిణులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు.ఏడాదికి రూ. 24,000 నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు.
అంతేకాదు.. రాష్ట్రంలో ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ ప్రకటిం చింది. ఇక, గృహలక్ష్మీ పథకం విషయానికి వస్తే.. ఎల్పీజీ ధర పెరుగుదల, జీవన వ్యయం నుంచి మహిళలను ఆదుకునేందుకే ప్రకటించామని ప్రియాంక తెలిపారు.
మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పడం మరో ఎన్నికల హామీగా ఉంది. మొత్తానికి ఉచితాలు.. ఆగేలా కనిపించడం లేదు. మరోవైపు.. బీజేపీ మాత్రం తాముఎలాంటి ఉచితహామీలు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. మరి కన్నడిగులు ఎవరికి పట్టం కడతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.