Begin typing your search above and press return to search.

గెలిచే అభ్య‌ర్థి గురించి చెప్పి అడ్డంగా బుక్!

By:  Tupaki Desk   |   5 Nov 2018 5:10 AM GMT
గెలిచే అభ్య‌ర్థి గురించి చెప్పి అడ్డంగా బుక్!
X
ఒళ్లంతా క‌ళ్లు అన్న‌ట్లుగా మాయ‌దారి సెల్ ఫోన్ పుణ్య‌మా అని.. ఇప్పుడు ఎప్పుడు ఎక్క‌డ ఏ కెమేరా క‌న్ను చూస్తుందో అర్థం కాని ప‌రిస్థితి. మారిన కాలానికి త‌గ్గ‌ట్లుగా ఆచితూచి అడుగులు వేయ‌టం.. మాట్లాడే మాట‌ల విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు చాలా అవ‌స‌రం.

ఈ విష‌యాన్ని ప‌ట్టించుకోని అధినేత‌లు.. నేత‌లంతా అడ్డంగా బుక్ అయిన వారే. తాజాగా ఇప్పుడు అలాంటి ప‌రిస్థితే ఎదుర్కొంటున్నారు మాజీ కేంద్ర‌మంత్రి.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ పీసీసీ అధ్య‌క్షుడు క‌మ‌ల్ నాథ్‌. పోటాపోటీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌త్య‌ర్థి.. ఎంపీ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ తాజాగా ఒక వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో క‌మ‌ల్ నాథ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. త‌న‌కు ఎన్నిక‌ల్లో గెలిచే అభ్య‌ర్థులు కావాలే కానీ.. స‌ద‌రు అభ్య‌ర్థిపై ఎన్ని కేసులు ఉన్నాయ‌న్న‌ది త‌న‌కు అన‌వ‌స‌రం అంటూ చెబుతున్న మాట‌ల వీడియో క్లిప్ ను తాజాగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నేర రాజ‌కీయాల్ని ప్రోత్స‌హించేలా కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. ఈ త‌ర‌హా రాజ‌కీయ‌మే కాంగ్రెస్ చేసేట‌ట్లైయితే.. ప్ర‌జ‌లు తెలివైన వార‌ని.. ఎవ‌రిని గెలిపించాలో వారికి బాగా తెలుసంటూ చౌహాన్ ట్వీట్‌ లో పేర్కొన్నారు. క‌మ‌ల్ నాథ్ వ్యాఖ్య‌ల వీడియో వైర‌ల్ అయ్యింది. "ఆ అభ్య‌ర్థిపై ఐదు కేసులు ఉన్నాయ‌ని నాకెవ‌రో చెప్పారు. ఆరు కేసులు అవ్వ‌నివ్వండి. గెలిచే అభ్య‌ర్థులే నాక్కావాలి" అన్న‌ మాట‌లు ఆ వీడియోలో ఉన్నాయి.

అయితే. ఈ వీడియో నిజం కాద‌ని.. ఉత్త ఫేక్ అంటూ కాంగ్రెస్ చెబుతోంది. న‌కిలీ వీడియోతో గంద‌ర‌గోళం సృష్టించ‌టంపై ఎన్నిక‌ల సంఘానికి.. సైబ‌ర్ క్రైమ్ సెల్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. మ‌రోవైపు ఈ వీడియోపై స్పందించిన కాంగ్రెస్‌.. ఒక‌వేళ ఈ వీడియో నిజ‌మే అయినా త‌ప్పు లేద‌ని.. ఎందుకంటే క‌మ‌ల్ నాథ్ నేర‌గాడు అన్న మాట‌ను ఎక్క‌డా వాడ‌లేద‌న్న విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. అంత కాన్ఫిడెంట్ గా పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చి.. మ‌ళ్లీ ఈ క‌వ‌రింగ్ మాట‌లేంది? లేనిపోయింది పెద్దాయ‌న కెమేరా కంటికి దొరికిపోయారా ఏంటి?