Begin typing your search above and press return to search.
కన్నడలో కలకలం..గాలి ప్రలోభాల ఆడియో వెలుగులోకి
By: Tupaki Desk | 18 May 2018 3:34 PM GMTకర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకదాని వెంట మరొకటి అన్నంత ఉత్కంఠగా సాగుతున్న పరిణామాల పరంపరలో మరో కలకలం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శనివారం బలపరీక్ష జరగాల్సి ఉండగా...అంతకుముందు రోజే బీజేపీ తన పీఠం నిలుపుకునేందుకు చేపట్టిన సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు బీజేపీ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి రాయభారాలు జరిపారు.ఈ సంచలన ఆడియోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దీంతో కన్నడ రాజకీయం ఉత్కంఠగా మారింది.
రాజకీయవర్గాల విశ్లేషణ ప్రకారం బీజేపీ అధికారంలో ఉండేందుకు `కావాల్సిన` చర్యలన్నింటినీ గాలి జనార్దన్ రెడ్డి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యూహరచనల్లో భాగంగా పార్టీకి సంబంధించిన క్యాంప్‌ను ఆయన సమన్వయం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీని అధికారంలో ఉంచడం - విశ్వాసపరీక్షలో నెగ్గించడం కోసం గాలి బేరసారాలకు కూడా దిగారు. ఈ ప్రలోభాల పర్వానికి చెందిన ఆడియో బయటపడింది. రాయచూర్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బసన్న గౌడతో గాలి ఫోన్ చేసి బేరమాడారు. ఆడియోలో ఏముందంటే..
``పాత విషయాలు మర్చిపోండి. మీకు ఏం కావాలో జాతీయ అధ్యక్షుడే నేరుగా మాట్లాడుతారు. శివనగౌడ నాయక్ నా మాట విని మంత్రి అయ్యారు. రాజీవ్ గౌడ నా వల్లే డెవలప్ అయ్యారు. ఇవాళ శివనగౌడ నాయక్ గెలిచినా ప్రయోజనం లేదు. నువ్వు మంత్రి అవుతావు, నేరుగా పెద్దవాళ్లతో మాట్లాడిస్తా. నువ్వు సంపాదించుకున్న ఆస్తి కన్నా వందరెట్లు సంపాదించుకుంటావు. యడ్యూరప్పకు మద్దతిస్తే లైఫ్ సెటిల్ చేస్తా``ని అని బసన్నకు గాలి జనార్ధన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ బసన్న ఏమన్నారంటే.. ``చివరి పరిస్థితుల్లో నాకు టికెట్ ఇచ్చి ఆదుకున్నారు. కాంగ్రెస్‌కు నేను ద్రోహం చేయలేను. మీరంటే నాకు గౌరవం, అభిమానం ఉంది` అని బసన్న వ్యాఖ్యానించారు.
వీడియో కోసం క్లిక్ చేయండి