Begin typing your search above and press return to search.
టీఆర్ ఎస్ 500 రోజుల పాలనః సూపర్ ట్విస్ట్
By: Tupaki Desk | 12 Nov 2015 4:49 PM GMTతెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ 500 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి, పార్టీ అధినేత కేసీఆర్ కు ఊహించని గిఫ్ట్ వచ్చింద. టీఆర్ ఎస్ 500 రోజుల పాలనపై ప్రత్యేకంగా ఓ బుక్ లెట్ ను తెలంగాణ కాంగ్రెస్ కమిటీ విడుదల చేసింది. 'టీఆర్ ఎస్ 500 రోజుల పాలన-50 ప్రశ్నలు' పేరుతో షబ్బీర్ అలీ ఈ పుస్తకాన్ని రూపొందించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - మాజీ మంత్రి షబ్బీర్ అలీ - సుధాకరరెడ్డిలు ఈ బుక్ లెట్ ను విడుదల చేశారు.
తాము సంధిస్తున్న 50 ప్రశ్నలకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సమాధానం చెప్పాలని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యమంలో పెట్టిన కేసులు ఉపసంహరిస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారన్నారు. అలాగే ఫాస్ట్ పథకం స్లో అయిందని, డబుల్ బెడ్ రూమ్ ఊసేలేదని ఎద్దేవా చేశారు. హామీలను మరిచిన కేసీఆర్ కు వరంగల్ ఉప ఎన్నికలో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వాటర్ గ్రిడ్ పేరుతో సొమ్ములొచ్చేపథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, కుటుంబ పాలనకు పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు.
వరంగల్ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో కేసీఆర్ సమాధానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తే కేసీఆర్ తన సొంత ఇలాకాగా దొరల పాలన చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ పుస్తకాన్ని పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కలిగిస్తామన్నారు.