Begin typing your search above and press return to search.
మోడీ బ్యాచ్ బట్టలిప్పేస్తున్నారు
By: Tupaki Desk | 19 May 2018 9:23 AM GMTఓటమి మామూలే. కానీ.. అవమానకర ఓటమితోనే ఇబ్బంది. అవమానిస్తే సానుభూతి లభిస్తుంది. కానీ.. తనకు తానుగా అత్యాశకు పోయి మరీ నెత్తి మీదకు తెచ్చుకుంటే ఎవరూ బాగుపర్చలేరు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి అలానే ఉంది. అతిగా ఆశ పడే మగాడు.. అతిగా ఆశ పడే ఆడది బాగుపడినట్లు చరిత్రలోనే లేదన్న విషయం కర్ణాటక ఎపిసోడ్‌లో మరోసారి రుజువైంది.
విశ్వాస పరీక్ష ఫలితం సంగతి తర్వాత.. దాని కంటే ముందు.. ఒక్కొక్కరిగా బీజేపీ నేతలు చేసిన రాయబేరాలు.. ఆడియో క్లిప్పుల రూపంలో బయటకు వచ్చిన వైనంతో కమలనాథులు కంగుతినే పరిస్థితి. ఇప్పటివరకూ బేరసారాలకు మహా ఘటికుడైన గాలి బ్యాచ్ చేస్తారనుకుంటే.. చూసేందుకు పెద్ద మనిషిగా ఉండే యడ్డీ కూడా ఎంత నీచంగా బేరాలు చేశారన్నది ఆడియో టేపు సాక్షిగా బయటకు వచ్చేసింది.
కర్ణాటకలో ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు బీజేపీ వేసిన వేషాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ.. ఆ పార్టీ మీద ఒత్తిడిని అంతకంతకూ పెంచుతోంది. దీంతో.. విచక్షణ మరిచి.. ప్రత్యర్థుల వలలోకి సులువుగా పడిపోయిన వైనం కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న ఆడియో టేపులతో బయట పడుతున్న పరిస్థితి.
మరికాసేపట్లో ఆసెంబ్లీలో బలపరీక్ష సమయంలో.. అధికారాన్ని నిలుపుకోవటానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న యడ్యూరప్ప నేరుగా బేరసారాలు చేసినట్లుగా చెప్పే ఆడియో టేపు వెల్లడై సంచలనం సృష్టిస్తోంది. ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ తో యడ్యూరప్ప జరిపిన బేరసారాల ఆడియో టేపు ఇప్పుడు సంచలనంగా మారింది. తొలుత గాలి బ్యాచ్ తో బేరాలు ఆడి.. కన్ఫర్మేషన్ కోసం యడ్డీతోనే డైరెక్టుగా మాట్లాడిన వైనం ఆడియోలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి.
తాజాగా విడుదలై సంచలనంగా మారిన ఆడియో టేపును చూస్తే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న యడ్యూరప్ప ఎంత దారుణమైన బేరాలకు దిగారో ఇట్టే అర్థమవుతుంది. ఆడియో టేపులో ఉన్న సంభాషణను చూస్తే..
సీఎం యడ్యూరప్ప: మంత్రి పదవితో పాటు రూ.5 కోట్లు ఇస్తా
కాంగ్రెస్ ఎమ్మెల్యే పాటిల్ : ఇకపై నా పొజిషన్ ఏంటి?
సీఎం యడ్యూరప్ప: మంత్రివి అవుతావు
కాంగ్రెస్ ఎమ్మెల్యే పాటిల్ : నాతో మరో ఇద్దరు..ముగ్గురు ఉన్నారు
సీఎం యడ్యూరప్ప: నీ వెంట ఉన్న వారిని తీసుకొని రా.. నా మీద విశ్వాసం ఉంది కదా, ఒకసారి కొచ్చి వెళ్తే ఇక దొరకవు..
కాంగ్రెస్ ఎమ్మెల్యే పాటిల్ : అలా జరగదు
సీఎం యడ్యూరప్ప: ఇంట్లో వాళ్లకి సమస్య ఉందని వెనక్కి వచ్చేయ్
కాంగ్రెస్ ఎమ్మెల్యే పాటిల్ : ఐదు నిమిషాల్లో మీకు ఫోన్ చేసి చెబుతా
సీఎం యడ్యూరప్ప: అయితే.. శ్రీరాములుకు ఫోన్ చేసి చెప్పు