Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క ట్ర‌బుల్ షూట‌ర్‌ కు మైండ్ బ్లాంక్‌

By:  Tupaki Desk   |   22 Dec 2018 10:07 AM GMT
క‌ర్ణాట‌క ట్ర‌బుల్ షూట‌ర్‌ కు మైండ్ బ్లాంక్‌
X
ఈ ఏడాది దేశ‌వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప‌రిణామం అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం అనేక వ్యూహాలు ప‌న్నిన‌ప్ప‌టికీ...అన్నింటికీ మించి జేడీఎస్‌-కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను చేజార‌కుండా చేసి ఆ పార్టీ కూట‌మే గ‌ద్దెనెక్కేందుకు కార‌ణ‌మైంది కన్నడ ప్రజలకు డీకేఎస్‌ గా సుపరిచితుడైన మాజీ మంత్రి డీకే శివకుమార్. క్లిష్ట పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను ఈగల్టన్ రిసార్ట్‌ కు తరలించి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు హైదరాబాద్‌ కు తరలించడం, మళ్లీ కర్ణాటకకు సురక్షితంగా తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార చైర్మన్ గా హెచ్.కె.పాటిల్ నియమితులయ్యారు. డీకే శివకుమార్‌ ను ప్రచార కమిటీ చైర్మన్‌ గా తొలగించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాజీ మంత్రి పాటిల్‌ ను నియమించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీకే శివకుమార్ రాష్ట్రంలో టీపీసీసీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన్న విషయం తెలిసిందే.

కాగా, ఇటీవ‌ల తెలంగాణ ఎన్నిక‌ల్లో డీకే శివ‌కుమార్ కీల‌క పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీకి రెబెల్స్‌ తాకిడి ఎక్కువైంది. గాంధీభవన్‌ ముందు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోనూ తీవ్రమైన అసమ్మతి చెలరేగింది. దాదాపు 40 మంది అసమ్మతి నేతలు ఇప్పటికే నామినేషన్లు వేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరందరిని బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ త్రిసభ కమిటిని రంగంలోకి దించింది. అసమ్మతి నేతలతో శనివారం, ఆదివారం చర్చ లు జరపనుంది. ఈ త్రిసభ్య కమిటీలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి, మంత్రి మల్లాది కృష్ణారావు, కర్నాటక మంత్రి డికె శివకుమార్‌ ఉన్నారు. అలాంటి వ్య‌క్తి తాజాగా ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్‌ గా తొల‌గించింది.