Begin typing your search above and press return to search.
రేవంత్ దూకుడు.. ఘర్ వాపసీకి పచ్చజెండా!
By: Tupaki Desk | 23 July 2022 2:30 AM GMTతెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని.. రా ష్ట్రాన్ని ఇచ్చిన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాల వారీగా ఆయన పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఇక, జిల్లా ఏదైనా కూడా.. ఘర్ వాపసీ మంత్రానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నిన్న మొన్నటి వరకు పార్టీలో ఉండి.. ఇతర పార్టీల్లోకి చేరిన నాయకులను తిరిగి సొంత గూటికి తెచ్చేందుకు రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కీలకమైన కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ మళ్లీ పునర్‌వైభవం దిశగా అడుగులు వేస్తుండడం గమనార్హం.
కరీంనగర్‌లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునేందుకు ఆ పార్టీ బహుముఖ వ్యూహం తో ముందుకు సాగుతున్నది. పార్టీ నుంచి టీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లిన నేతలను తిరిగి సొంత గూటికి రప్పించుకోవడం, ఇతర పార్టీల్లో అవకాశాలు దక్కని అసంతృప్తినేతలను, బలమైన నేతలను గుర్తించి పార్టీలోకి ఆహ్వానించడంపై దృష్టిసారించింది. ఉమ్మ డి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంథనిలో మాత్రమే కాంగ్రెస్‌కు చెందిన శ్రీధర్‌బాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మిగతా 12 స్థానాల్లో ఆరింటిలో పార్టీకి సానుకూల వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో దానిని ఆసరాగా చేసుకొని బలమైన నేతలను రంగంలోకి దింపి మిగతా స్థానాల్లో కూడా పట్టు సాధించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా పనిచేసిన మానకొండూర్ మాజీ శాసనసభ్యుడు ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ టి సంతోష్‌కుమార్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు.
అయితే, వారికి అక్కడ తగిన ప్రాధాన్యం లభించని నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్ గూటికి రానున్నారని ప్రచారం జరుగుతోంది. కొద్ది నెలలుగా అటు టీఆర్ఎస్ వర్గాల్లో ఇటు కాంగ్రెస్ వర్గాల్లో ఈ ప్రచారం ఉంది. ప్రవీణ్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి వీరిద్దరి పేర్లు మళ్లీ తెరపైకి వచ్చాయి. వారంరోజుల్లోగానే వీరు తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని అంటున్నారు. వీరిద్దరిపై బీజేపీ నాయకత్వం కూడా దృష్టి సారించిందని, వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా మానకొండూర్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీలో నిలపాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అయినప్పటికీ వారివురు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకే సుమఖంగా ఉన్నట్లు సమాచారం.
కరీంనగర్ జిల్లాలో వెలమ సామాజిక వర్గానికి మూడు టికెట్లు ఇస్తున్న నేపథ్యంలో రెడ్డీ సామాజికవర్గానికి కనీసం నాలుగు స్థానాలు ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డి పోటీ చేయడం ఖాయమని, ప్రవీణ్‌రెడ్డి హుస్నాబాద్ టికెట్ ఇస్తామన్న హామీతోనే తిరిగి కాంగ్రెస్‌లో చేరారని తెలిసింది.
ఈ నేపథ్యంలో కరీంనగర్, సిరిసిల్ల నియోజక వర్గాలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని రేవంత్ భావిస్తున్నారు. అయితే, ఇలా చేస్తే.. బీసీలకు అవకాశాలు తగ్గిపోతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిని ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసి.. కరీంనగర్‌లో పార్టీని గాడిలో పెట్టాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.