Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ పునరుత్తేజం తేలిక కాదు.....సోనియా సంచల వ్యాఖ్యలు...?
By: Tupaki Desk | 5 April 2022 11:30 AM GMTకాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇపుడు దేశంలో ఎలా ఉంది అంటే రాజకీయాల మీద ఆ మాత్రం ఆసక్తి అవగాహన ఉన్న వారు ఇట్టే జవాబు చెప్పేస్తారు. దాని కోసం చింతన్ శిబిర్ లు అవసరం లేదు, బుర్రలు బద్ధలు కొట్టుకోవడం అంతకంటే అవసరం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఏం కోల్పోయిందో ఈ ఎనిమిదేళ్ల వ్యవధిలో ఆ పార్టీ ఎంత లోతులను చూసిందో ఖద్దరు పార్టీ నేతలు అందరికీ తెలుసు.
మరి ఏం చేయాలీ అంటే అంతా కలసి అధినాయకత్వం వైపు చూస్తారు. అక్కడికి సోనియా గాంధీ రాహుల్ గాంధీల వద్ద మంత్ర దండమేదో ఉన్నట్లుగా కాంగ్రెస్ చూ మంత్రం చదివితే నంబర్ వన్ ర్యాంక్ కి కాంగ్రెస్ చేరుకుంటుంది అని భ్రమలు పడతారు. నిజానికి కాంగ్రెస్ ఎక్కడో ఢిల్లీలో మెయిన్ ఆఫీసులో లేదు, జనపధ్ లో అంతకంటే లేదు.
ఆ పార్టీ జనాల మధ్యనే ఉంది. అయితే వారితో పార్టీని కనెక్ట్ చేయడంతో నేతలు వెనకబడిపోయారు. ఒక విధంగా అన్ని పార్టీలలో డీ సెంట్రలైజ్ విధానాలు అమలు అవుతూంటే కాంగ్రెస్ లో మాత్రం ఇంకా గాంధీల మీద భారం పెట్టి దండం పెట్టి వస్తున్నారు.
ఇలాంటి వారి మీద, కాంగ్రెస్ పోకడల మీద ఏకంగా సోనియా గాంధీయే అసహనం వ్యక్తం చేయడం విశేషం. కాంగ్రెస్ బాగుపడాలీ అంటే ముందు ఐక్యత ముఖ్యమని సోనియా ఆసక్తికరమైన కామెంట్స్ తాజాగా చేశారు. అవును, జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టుకోవడాలు, ఒకరి కాలు మరొకరు దిగలాగడాలు చేస్తే కాంగ్రెస్ ఎక్కడ బతికి బట్టకడుతుంది.
ఇదే కదా అందరి బాధా. ఢిల్లీ వెళ్లి అంతా చెప్పింది బుద్ధిగా వినేసి తీరా తమ వర్గం, తమ గ్రూపులూ అంటూ గల్లీలలో కధ నడుపుతూంటే, పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ చేస్తూంటే కాంగ్రెస్ జనాల వద్దకు ఎందుకు చేరుతుంది. బహుశా ఇలాంటి వాటి మీదనే అధినేత్రి ఆలోచించి మరీ తన చికాకుని ప్రదర్శించారు అనుకోవాలి.
కాంగ్రెస్ కి పునరుత్తేజం తేవడం అంత తేలిక అయిన విషయం కాదని కూడా సోనియా అనడమూ సంచలనమే. అంటే పార్టీ ఎంతలా ఇబ్బందులు పడుతోందా ఆమె అంచనాకు వచ్చేశారు. అయితే ఎలా మళ్లీ పార్టీని గాడిన పెట్టాలీ అన్నదే ఆమె ఆలోచన చేస్తున్నారు అని అర్ధమవుతోంది.
అందుకే ఆమె పార్టీ ఎంపీలకు గట్టి వార్నింగే ఇచ్చేశారు. విభేదాలతో టైమ్ పాస్ చేస్తే కష్టమని చెప్పేశారు. తాను ఊరుకునే ప్రసక్తి లేదని కూడా స్పష్టం చేశారు. పార్టీని ముందుకు తీసుకురావడానికి అంతా కలసి రావాలని ఆమె గట్టిగా కోరారు. అందరూ ఐకమత్యంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరాదిని తాజాగా జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎంతలా పార్టీని కృంగదీసింది అన్నది తాను అర్ధం చేసుకోగలను అని ఆమె అంటున్నారు. మొత్తానికి గతానికి భిన్నంగా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం మీద కూర్చున్న నేత వేరేగా ఆలోచించడం, పార్టీ ప్రెజెంట్ సిట్యువేషన్ ఏంటి అన్నది పూర్తిగా అవగాహన చేసుకుని రియాల్టీకి దగ్గరగా స్పందించడం నిజంగా మంచి విషయం.
కాంగ్రెస్ ఒక విధంగా పొరపాట్లను గుర్తిస్తోంది. తప్పు ఎక్కడ జరుగుతోంది అన్నది గమనిస్తోంది. అంటే రోగం ఏంటి అన్నది తెలిసింది. దానికి మందు వేయడం ఏంటి అన్నదే ఆలోచించాలి. ఈ విషయంలో సోనియా గాంధీ తనదైన మార్క్ ట్రీట్మెంట్ కనుక ఇస్తే మళ్లీ కాంగ్రెస్ దేశాన లేచి కూర్చుంటుంది అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ 140 ఏళ్ళ పార్టీ తాను అన్న అనుభవాన్ని మాత్రం చూపించింది అనే చెప్పుకోవాలి. ఇక మీదట సోనియా గాంధీ అడుగులు ఎలా ఉంటాయో కూడా గమనించాలి.