Begin typing your search above and press return to search.

కొండకు దారం కట్టేద్దాం..అనుకుంటున్న కాంగ్రెస్‌

By:  Tupaki Desk   |   18 Sep 2015 4:11 AM GMT
కొండకు దారం కట్టేద్దాం..అనుకుంటున్న కాంగ్రెస్‌
X
వస్తే కొండ వస్తుంది.. పోతే దారమేగా పోయేది.. నష్టమేముంది అనుకున్నట్టుగా ఉంటోంది కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతున్న తీరు. మోడీని నియంత్రించడానికి తాము ఎన్నుకుంటున్న మార్గాల్లో కొన్ని ఎలాంటి పలితమూ ఇవ్వబోవని వారికి ఖచ్చితంగా తెలుసు. అయినా ప్రయత్నం మాత్రం మానుకోవడం లేదు. ఎలాగంటే.. బీహార్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని రేడియో ద్వారా సాగించే మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని నిషేధించాలని.. కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

నిజానికి ప్రధాని హోదాలో యావత్‌ దేశాన్ని ఉద్దేశించి.. ఇదివరకటినుంచి రెగ్యులర్‌ గా జరుగుతున్న ఒక కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయి గనుక.. నిషేధించడం అనేది సాధ్యం కాని పని. ఆ విషయం కాంగ్రెస్‌ పార్టీకి కూడా తెలుసు. వారికి స్వానుభవంలో కూడా ఉంది. కాకపోతే.. ఏముంది.. కనీసం మోడీ మీద ఒక ఫిర్యాదు చేసినట్లు ఉంటుంది కదా అనే ఉద్దేశంతోనే వారు ఈసీని ఆశ్రయించారు.

మోడీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమం షెడ్యూలు ప్రకారం.. ఈనెల 20వ తేదీన జరగాల్సి ఉంది. ఇది ప్రభుత్వ ప్రసార మాధ్యమాలను ఎన్నికల ప్రచారం కిందికి వాడుకోవడం అవుతుందంటూ బీహార్‌ కాంగ్రెస్‌ ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఈసీ మాత్రం దీనిని సీరియస్‌ గా తీసుకోలేదు. నియమావళి పేరు చెప్పి... ఇలాంటి కార్యక్రమాల్ని నిషేధించలేం అని.. ఆ ప్రసంగంలో.. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉంటే దానిపై చర్య తీసుకోగం అని చెప్పింది. గతంలో హర్యానా ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్‌ ఇదే తరహా ఫిర్యాదుచేసి భంగపడింది.