Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో అప్పుడే మొదలైన లొల్లి
By: Tupaki Desk | 7 Aug 2021 4:06 AM GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త పాలక వర్గం ఏర్పడిన తరువాత కార్యకర్తల్లో జోష్ పెరిగింది. యూత్ ఫాలోయింగ్ తో పాటు దూకుడుగా దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయని నేతలు ఆశలు పెంచుకుంటున్నారు. గత దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితిని చూసిన చాలా మంది పార్టీలో ఉండడానికే భయపడ్డారు. కానీ కొత్త పాలక వర్గం ఏర్పడిన తరువాత ఇప్పటి నుంచే అసెంబ్లీ సీట్ల కోసం కుస్తీ పడుతున్నారు. భూపాలపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్ సీటు ఎంత విలువైందో అర్థమవుతుంది.
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గ 2009లో ఏర్పడింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన గండ్ర వెంటకరమణారెడ్డి గెలుపొందారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో నిర్వహించిన ఎన్నికల్లో టీఆర్ఎస్ హవాలో భాగంగా ఆ పార్టీ నుంచి పోటీ చేసిన సిరికొండ మధుసూదన చారి విజయం సాధించారు. అయితే నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ కు పట్టు ఉంది. ఇందులో భాగంగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. దీంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన గండ్ర వెంటకరమణారెడ్డి మరోసారి విజయం సాధించారు.
అయితే ఆయన కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లోకి చేరడంతో పార్టీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. ఎమ్మెల్యే స్థాయిలో ఇక్కడ పోటీ చేసే నాయకుడే కరువయ్యారని ప్రచారం జరిగింది. అయితే టీడీపీలో మొదటి నుంచి కొనసాగుతున్న గండ్ర సత్యానారాయణ రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. రేవంత్ టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఆయనతో సాన్నిహిత్యం కొనసాగుతోంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాకా రాష్ట్రంలో కాంగ్రెస్ పోజిషన్ మారుతోంది. దీంతో ఇతర పార్టీల నుంచి కొందరు కాంగ్రెస్లోకి వలన వెళుతున్నారు.
ఈక్రమంలో గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్లోకి ఇంకా చేరకముందే ఆ పార్టీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తనకు రేవంత్ రెడ్డి సాన్నిహిత్యం గురించి చెబుతూ వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వచ్చేలా పార్టీ నాయకులకు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఒకప్పుడు పరకాల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన కొండా దంపతులు, ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆదరించారని, ఆ పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారిన వారి అనుచరులు అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో కొండా దంపతులు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం ఎంతో కృషి చేశారని అంటున్నారు. దీంతో గండ్ర సత్యనారాయణ వర్సెస్ కొండా దంపతుల మధ్య చీలికలు ఏర్పడ్డాయి.ఇదిలా ఉండగా కాంగ్రెస్ నుంచి మంథని ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దుద్దిళ్ల శ్రీధర్ బాబు పలు కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనతో పాటు తన తమ్ముడు శ్రీను బాబు కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో శ్రీనుబాబుకు టికెట్ దక్కేలా శ్రీధర్ బాబు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం.
ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రెండు సంవత్సరాల ముందు నుంచే సీట్ల లోల్లి మొదలైంది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేయాల్సిందిపోయి ఇప్పుడే సీటు కోసం కుంపట్లు తయారు చేయడంపై ద్వితీయ శ్రేణి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.