Begin typing your search above and press return to search.
బీజేపీలో చేరిన కూన.. కాంగ్రెస్ జాతకం బయటపెట్టేశాడు..!
By: Tupaki Desk | 22 Feb 2021 4:05 AM GMTకాంగ్రెస్ సీనియర్ నేత, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కూన పలు కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఓ వీడియో విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆయన ఏమన్నారంటే.. ‘మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను. 2009లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్లో చేరా. కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీని కాపాడాను.
అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలతో ఇబ్బంది పడుతున్నది. పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేసినప్పటికీ ఇప్పటివరకు కొత్త వ్యక్తిని నియమించుకోలేకపోయిందటే ఆ పార్టీ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2014, 18 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ ప్రజల తరఫున పోరాటం చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. అందుకు కారణం నాయకత్వ లోపమే. ఆ పార్టీని ఇప్పుడు ఎవరూ కాపాడలేరు’ అంటూ ఆయన ఫైర్ అయ్యారు.
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నని.. అయితే కాంగ్రెస్ పార్టీ .. టీఆర్ఎస్ అక్రమాలపై కాంగ్రెస్ పోరాటం చేయలేకపోతున్నదని చెప్పారు. టీఆర్ ఎస్ తో పోరాడే శక్తి బీజేపీ కి మాత్రమే ఉన్నదని కూన శ్రీశైలం గౌడ్ అభిప్రాయపడ్డారు. ప్రజలు కూడా బీజేపీనే నమ్ముతున్నారని చెప్పారు. ఇటీవల వచ్చిన జీహెచ్ఎంసీ, దుబ్బాక ఎన్నికల ఫలితాలనే ఇందుకు నిదర్శనమని చెప్పారు.