Begin typing your search above and press return to search.
సోనియానే దిక్కు.. కాంగ్రెస్ డిసైడ్ అవుతోందా?
By: Tupaki Desk | 7 Aug 2020 5:30 PM GMTసార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమితో కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలను రాహుల్ గాంధీ త్యజించాడు. సీనియర్లు అందరినీ పక్కనపెట్టి యువతరానికి పగ్గాలు ఇవ్వలనుకున్న ఆయన నిర్ణయం అమలు కాకపోవడంతో పార్టీ అధ్యక్ష పదవికి దూరంగా ఉన్నారు.
దీంతో విధిలేని పరిస్థితుల్లో అంత వృద్ధాప్య పరిస్థితుల్లో సోనియాగాంధీ మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. సీనియర్లు అంతా సోనియా పక్కనే చేరి ఇప్పుడు కాంగ్రెస్ ను యువతరానికి దూరం చేసే పనిని కంకణం కట్టుకొని మరీ చేస్తున్నారు.
అయితే రాహుల్ గాంధీకి మళ్లీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పి తాను ఇక రెస్ట్ తీసుకోవాలని.. ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్న వేళ రాహుల్ కే అప్పగించాలని చూస్తున్నట్టు తెలిసింది.
అయితే రాహుల్ మాత్రం అధ్యక్ష బాధ్యతలపై మౌనంగా ఉన్నట్టు సమాచారం. దీంతో సీనియర్లు అంతా కాంగ్రెస్ అధినేత్రినే మరోసారి అధ్యక్ష బాధ్యతలు మోయాలని కోరుతున్నట్టు తెలిసింది. లేకపోతే పార్టీ ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని.. నాయకులకు - కేడర్ కు మధ్య ఆగాధమేర్పడుతుందని చెబుతున్నారు.
పార్టీ రాజ్యాంగం ప్రకారం పార్టీ ఏడాదికోసారి భేటి కావాల్సి ఉంది. రెండేళ్లుగా ఈ ఏఐసీసీ భేటి జరగలేదు. ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో సోనియాకు - రాహుల్ ను ఒప్పించాలని కాంగ్రెస్ సీనియర్లు కోరుతున్నారు. లేకుంటే పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని.. అది మరీ డేంజర్ అని అంటున్నారు.